సినిమా

F3 Movie: బిగ్ అప్డేట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్‌.. రేపు బ్లాస్ట్ ఖాయ‌మ‌ట‌!

Share

F3 Movie: విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రంమే `ఎఫ్ 3`. ఇందులో త‌మ‌న్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్‌గా న‌టించ‌గా.. సోనాల్ చౌహాన్, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `ఎఫ్ 2`కు సీక్వెల్ ఇది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే.. రేపు(సోమవారం) ఉద‌యం 10.08 నిమిషాల‌కు ‘బ్లాస్టింగ్ టుమారో’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు.

దీంతో రేపు ఎఫ్ 3 టీజర్‌ విడుదలయ్యే అవకాశం ఉంద‌ని జోరుగా టాక్ న‌డుస్తోంది. మ‌రి నిజంగానే టీజ‌ర్ వ‌స్తే.. అటు వెంకీ ఫ్యాన్స్‌, ఇటు వ‌రుణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వ‌డం ఖాయం. కాగా, ఎఫ్ 2ను భార్య‌ల వ‌ల్ల భర్తలు ఎదుర్కొనే ఫ్రస్టేషన్స్ నేప‌థ్యంలో రూపొందించిన‌ అనిల్ రావిపూడి.. ఎఫ్ 3ని మాత్రం డబ్బు, దాని వ‌ల్ల‌ వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నాడు.

ఈ విష‌యాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేసాడు దర్శకుడు. అలాగే ఇందులో రేచీకటి ఉన్న వ్య‌క్తిగా వెంక‌టేశ్ న‌టిస్తే.. న‌త్తితో ఇబ్బంది ప‌డే వ్య‌క్తిగా వ‌రుణ్ అల‌రించ‌బోతున్నాడు.ఇక ఈ చిత్రం సంక్రాంతికే విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. అయితే స‌మ్మ‌ర్‌లో మాత్రం ప్రేక్ష‌కుల‌ను ఫుల్‌గా చిల్ చేసేందుకు వెంకీ-వ‌రుణ్‌లు సిద్ధంగా ఉన్నారు.


Share

Related posts

Mahesh – Balakrishna: రాజమౌళి రేర్ కాంబినేషన్‌ను సెట్ చేశాడా..?

GRK

RGV : కంగనా రనౌత్ vs రామ్ గోపాల్ వర్మ ! ఇదీ అసలైన ఫైట్

siddhu

Anjali Cute Images

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar