సినిమా

Manchu Vishnu Daughters: సినీ ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు కూతుళ్లు..!

Share

Manchu Vishnu Daughters: సినీ ఇండ‌స్ట్రీలో వార‌సులకు కొద‌వ లేదు. సినిమా పరిశ్రమలో వారసులు రాక ఎప్పుడూ కొన‌సాగుతూనే ఉంటుంది. హీరో,హీరోయిన్ల వార‌సులే కాదు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సైతం త‌మ వార‌స‌లను ప‌రిచ‌యం చేస్తుంటారు. ఇదేమి ఇప్పుడు వ‌చ్చింది కాదు. సినిమా పరిశ్రమ మొదలు నుంచి ఉన్నదే. అయితే త్వ‌ర‌లోనే మ‌రో ఇద్ద‌రు వార‌సులు సినీ గ‌డ‌ప తొక్క‌బోతున్నారు.

వారెవ‌రో కాదు మంచు మోహన్ బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా. వీరిద్ద‌రూ సింగ‌ర్స్ గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. అది కూడా వారి తండ్రి సినిమా ద్వారానే అట‌. మంచు విష్ణు ప్ర‌స్తుతం `గాలి నాగేశ్వరరావు` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పాయ‌ల్ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అవ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మితం కానుంది. అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి కథ, స్ర్కీన్‌ప్లే‌తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీలో మంచు వారి లిటిల్ స్టార్స్ అరియానా, వివియానాలు ఓ సాంగ్‌ను ఆల‌పించారు.

భాస్కరభట్ల ఈ పాటకి సాహిత్యం.. అనూప్ స్వ‌రాలు స‌మ‌కూర్చార‌ట‌. అరియానా, వివియానాలు పాడే ఈ సాంగ్‌కు సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిల‌వ‌బోతోంద‌ని, సినిమాలోని కీలక సందర్భంలో ఆ పాట వస్తుంద‌ని అంటున్నారు. కాగా, ఈ సినిమాలో ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ సాంగ్ సినిమాకు మరో హైలైట్ గా నిల‌వ‌నుంది.


Share

Related posts

బ్రేకింగ్: నిహారిక, చైతన్యల నిశ్చితార్ధానికి చిరు, చరణ్

Vihari

Samantha RuthPrabhu Beauty Queen Pictures

Gallery Desk

గిఫ్ట్ స్మార్టే కానీ నిజం వర్‌స్ట్

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar