Salaar: `కేజీఎఫ్` సిరీస్‌తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాధించుకున్న కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను నేషనల్ స్టార్ ప్రభాస్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. `సలార్` టైటిల్‌తో గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే విలన్ పాత్రలో సీనియర్ నటుడు జగపతిబాబు కనిపించబోతున్నారు. `కేజీఎఫ్` నిర్మాత విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండగా.. రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
అదేంటంటే.. సలార్ సినిమా టీజర్‌ను మే నెలలో మేకర్స్ విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇక కేజీయఫ్ 2 చిత్రంలో యశ్‌ను వయొలెంట్ మ్యాన్‌గా చూపించిన ప్రశాంత్ నీల్.. సలార్ చిత్రంలో ప్రభాస్‌ను ‘ది మోస్ట్ వయొలెంట్ మ్యాన్’గా చూపించేందుకు రెడీ అవుతున్నారట.
మరి నిజంగానే వచ్చే నెలలో సలార్ టీజర్ వస్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. కాగా, ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ఓం రౌత్ తో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో `ప్రాజెక్ట్-కె`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` చిత్రాలు చేస్తున్నాడు. వీటితో పాటు మారుతితో ఓ మూవీ చేసేందుకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.