బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేస్తున్నాడు ముక్కు అవినాష్. ఈ సీజన్లో హౌస్ లో ప్రేక్షకులకు… ఇంటిలో ఉన్న సభ్యులకు మంచి ఎంటర్ టైన్ దొరుకుతుంది అంటే అది ముక్కు అవినాష్ నీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ముక్కు అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండటంతో జబర్దస్త్ కామెడీ షోలు స్కిట్ లు కొద్దిగా డల్ అయినా పరిస్థితి.
అంతేకాకుండా బిగ్ బాస్ రియాల్టీ షోకి ఆదరణ ఉండటంతో జబర్దస్త్ టిఆర్పి రేటింగ్ కూడా కొద్దిగా తగ్గటం జరిగిందట. పైగా ఐపీఎల్ సీజన్ కావడంతో జబర్దస్త్ చూసే వారి సంఖ్య కొద్దిగా తగ్గినట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ లో హైపర్ ఆది పంచ్ డైలాగులకు, స్కిట్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన అవినాష్ పై రగిలి పోయేటట్టు తన తాజా స్కిట్ లో హైపర్ ఆది రెచ్చిపోయాడు. వంట మాస్టర్ అయిన ఆదితో భార్య గెటప్ వేసిన శాంతి స్వరూప్ ‘ఎంత కాలమని ఇలా గరిటే పట్టుకుని వంటలు చేసుకుంటాం.
కనీసం ఈఎంఐలో ఒక ఇల్లు తీసుకోవచ్చుగా’ అని అంటాడు. దీనికి ‘వాటి గురించి మాట్లాడకు. ఇలా హౌస్‌లకు ఈఎంఐలు కట్టలేకే మనోడు ఒకడు వేరే హౌస్‌కు వెళుతున్నాడు తెలుసుగా’ అంటూ పరోక్షంగా అవినాష్‌పై సెటైర్ వేశాడు ఆది. దీంతో ఈ డైలాగు విని చాలా మంది అవినాష్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం హైపర్ ఆది కి రగిలిపోతున్నటు ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!