బిగ్ బాస్ హౌస్ లో చాలా కూల్ గేమ్ అభిజిత్ ఆడుతున్నాడని మొన్నటిదాకా సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పొగడ్తలు కురిపించారు. కానీ ఇటీవల బిగ్ బాస్ హోటల్ సిబ్బంది గెస్ట్ లు టాస్క్ లో అభిజిత్ ఆడిన ఆట చూసి బయట జనాలు విమర్శలు చేస్తున్నారు. ఎంతసేపు ఆడవాళ్ళను అడ్డంపెట్టుకుని… వాళ్ల ఫీలింగ్స్ తో ఆడుకుంటూ తన గేమ్ ప్లాన్ హౌస్ లో అమలు చేస్తున్నాడని… ఇంత దరిద్రపు ఆట మూడు సీజన్ లలో ఎవ్వరు కూడా ఆడలేదని బయట భయంకరమైన విమర్శలు వస్తున్నాయి.
మనుషులు రోబో టాస్క్ లో దివిని బలి చేయడం తాజాగా బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో దేత్తడి హారికా నీ బలి చేయడం.. ఇది దారుణమైన గేమ్ అని అభిజిత్ మరి చిల్లరి చీప్ ప్లే ట్రిక్స్ ఆడవాళ్ళతో చేస్తూ ఆడుతున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. హోటల్ టాస్క్ లో దేత్తడి హారిక దగ్గర ఫ్రెండ్షిప్ అంటూనే మాట్లాడుతూ ఐదు స్టార్లు కొట్టేయడం పట్ల హారిక కుటుంబ సభ్యులకు కూడా అభివృద్ధి చేసిన పనికి పిచ్చ కోపం గా ఉన్నారట.
మిగతా ఇంటి సభ్యులు తమ కూతుర్ని విమర్శలు చేసి హౌస్ నుండి పంపిస్తే ఎవరు బాధ్యులు.. అన్న రీతిలో హారిక ఇంటి సభ్యులు అన్నట్లు సోషల్ మీడియా టాక్. ఏది ఏమైనా అభిజిత్ ఎక్కడికక్కడ తన గేమ్ ప్లాన్ ఆడవాళ్ళను అడ్డంపెట్టుకుని చేయటం పట్ల సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది.