NewsOrbit
సినిమా

Chiranjeevi – Abijeet : మెగాస్టార్ ను కలిసిన బిగ్ బాస్ విన్నర్…ఎందుకో తెలుసా..?

bigg-boss-4-winner-abhijeet-meets-megastar-chiranjeevi-

Chiranjeevi – Abijeet: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా పరిశ్రమలో చిరంజీవి గారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. సొంత కష్టంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గొప్ప స్థానంలో ఉన్న చిరంజీవి గారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు. ఎంతో మంది హీరోలు ఆయన అడుగుజాడల్లోనే నడిచి మంచి విజయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయడంలో చిరంజీవి ముందుంటారు. అందుకే ఎంతో మంది యువ హీరోలు సైతం మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ రియాల్టీ షోలో విన్నర్ గా నిలిచిన అభిజిత్ తాజాగా మెగాస్టార్ ను కలిశారు. చిరుని కలిసిన ఆనందంతో ఆయనతో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

bigg-boss-4-winner-abhijeet-meets-megastar-chiranjeevi-
bigg boss 4 winner abhijeet meets megastar chiranjeevi

చిరంజీవి గారిని కలిసిన అభిజిత్ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా సోషల్ మీడియా వేదికగా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అభిజిత్ ను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. నిన్ను మొదటిసారి స్క్రీన్ పై చూసినప్పుడు హీరో మెటీరియల్ అనిపించింది అంటూ చిరంజీవి గారు అన్న ఈ మాటలు తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ అభిజిత్ తెలియజేశారు. ఎంతో గొప్ప స్థానంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇంత సాధారణంగా ఎలా ఉంటారు. ఈరోజు నేను ఒక అద్భుతమైన, అందరిలో ప్రోత్సాహం నింపే వ్యక్తిని కలిశాను. అంత గొప్ప స్థానంలో ఉండి కూడా ఎంతో వినయంగా ఇతరులతో మెలిగే విధానం తనకెంతో నచ్చిందని, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో విలువైనది ఎంతో మంది యువకులను ప్రోత్సహిస్తున్నందుకు థాంక్యూ సార్ అంటూ చిరంజీవి గురించి అభిజిత్ కామెంట్ చేశారు.

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్:
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో నటించిన అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అభిజిత్ ఎట్టకేలకు విన్నర్ గా నిలిచారు.బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత అభిజిత్ బిజీ అయిపోతారని అభిమానులు అందరూ భావించారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి దాదాపు కొన్ని నెలలు కావస్తున్నా చేయబోయే కొత్త ప్రాజెక్ట్ గురించి ఏ విషయం తెలియ చేయకపోవడంతో అభిమానులలో తీవ్ర నిరాశ ఎదురైంది.అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ రీమేక్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే సమాచారం జోరుగా వినిపించింది. ఈ విషయం గురించే ప్రస్తుతం అభిజిత్ మెగాస్టార్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా లూసిఫర్ లో అభిజిత్ నటిస్తున్నాడనే సమాచారం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related posts

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu