బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ లో జరిగిన ఊహించని సంఘటన తో జబర్దస్త్ ఫాన్స్ అందరూ కంగారు పడుతున్నారు !!

Share

తెలుగు టెలివిజన్ ఆడియన్స్ ని ఎంతగానో అలరించే షో లలో ముందు ఉండేది జబర్దస్త్ కామెడీ షో. తెలుగు టెలివిజన్ రంగంలో ఈ కామెడీ షోకి విపరీతమైన ఆడియన్స్ రెస్పాండ్ ఉండటంతో టీఆర్పీ రేటింగ్స్ ఊహించని రీతిలో నమోదవుతున్నాయి. ఈ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుదీర్, హైపర్ ఆది ఇలాంటి వాళ్లు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇలా టీంగా షోలో ఉండే వారంతా బయట కూడా కలసి మెలసి ఉంటారు. ఈ టీం లో ఏ ఒక్కరికి ఏదైనా జరిగితే అంతా బాధపడిపోతుంటారు. అటువంటిది జబర్దస్త్ కమెడియన్ కి ఇటీవల ప్రమాదం జరగడంతో జబర్దస్త్ టీం మెంబర్స్ తో పాటు జబర్దస్త్ ఫ్యాన్స్ కంగారు పడిపోయారు. 

Bigg Boss Killer Coins Task Misfire : Mukku Avinash Breaks His Leg, Monal Gajjar Injured And Cries | The India Mediaపూర్తి విషయంలోకి వెళ్తే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ తన పంచ్ డైలాగులతో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. అయితే ఇటీవల “కాయిన్స్ దొంగతనం” టాస్క్ లో అనుకోని ప్రమాదం జరిగింది. కిల్లర్ కాయిన్స్ అంటే బిగ్ బాస్ పెట్టిన ఈ టాస్క్ లో చాలామంది ఇంటి సభ్యులకు దెబ్బలు తగిలాయి.

 

ఈ టాస్క్ లో ముక్కు అవినాష్ ఏకంగా కింద పడిపోవడంతో కాలు బెనకడం తో ఇంటి సభ్యులు మోసుకేళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వెంటనే వైద్యులు రావడంతో వాళ్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఊహించని విధంగా ఈ సంఘటన జరగటంతో జబర్దస్త్ ముక్కు అవినాష్ ఆరోగ్యం గురించి తెగ కంగారు పడిపోతున్నారు అంట.


Share

Related posts

Shirley Babithra Amazing Gallerys

Gallery Desk

రైతుల కోసం డిజిటల్ స్టూడియో అంట..! ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన

Special Bureau

బాబు ట్రాప్‌లో రాధా : పేర్ని నాని

Siva Prasad