RJ Kajal: ఆర్జే కాజల్.. బిగ్ బాస్ షో చూసిన వారికి ఇట్టే ఆమె తెలిసిపోతుంది. గతంలో ఆమె ఓ మీడియా ఛానల్ వేదికగా బిగ్ బాస్ షోకి వెళ్లడం తన కల అని, 19 మంది కంటెస్టెంట్స్‌తో పోట్లాడి టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పిన మాట తెలిసినదే. ఇకపోతే, కాజల్ మొదట షణ్ముఖ్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యి, ఆ తరువాత సన్నీ గ్రూప్‌లోకి చేరిన మాట కూడా తెలిసినదే. బేసిగ్గా కాజల్ ముక్కుసూటి మనిషి అనే విషయం ఆ ప్రోగ్రాం చూసిన ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది.
కాజల్ పై షన్ను అభిప్రాయం ఇదేనట.!
అయితే అలాంటి కాజల్ షన్నుని విడిచి సన్నీ గ్రూప్ లోకి చేరడం వలన షన్నుకి ఓరకంగా లాభం కంటే నష్టమే జరిగింది. అవును.. కాజల్ మంచితనాన్ని సన్నీ గౌరవించాడు. తన అభిప్రాయాలను గౌరవించి ఫ్రీడమ్ ఇచ్చాడు. అది కూడా సన్నీ గెలుపులో ఓ భాగంగా నిలిచిన మాట వాస్తవమే కదా. ఇకపోతే తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని షణ్ముఖ్ గతాన్ని నెమరు వేసుకున్నట్టుగా తెలుస్తోంది. తన సన్నిహితుల దగ్గర సందర్భానుసారంగా వచ్చిన టాపిక్ లో కాజల్ గురించి ప్రస్తావిస్తూ బాధపడ్డట్టుగా సమాచారం.
కాజల్ అభిప్రాయం ఇదే..
షణ్ముఖ్ గురించి తాజాగా కాజల్ ప్రస్తావిస్తూ.. షణ్ముఖ్‌కి పొసెసివ్ ఎక్కువ అని చెప్పుకొచ్చింది. నాతో మాత్రమే ఉండాలని అనుకుంటాడు. తన దగ్గర వుంటూ వేరొకరితో క్లోజ్ గా ఉంటే ఓర్వలేడు అని తెలిపింది. నేను స్టార్టింగ్‌లో షణ్ముఖ్‌కి కనెక్ట్ అయ్యాను. కానీ షన్ను బిహేవియర్ నచ్చక సన్నీ గ్రూప్ లో చేరాను. ఎందుకంటే నాకంటూ సెల్ప్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి షన్నుకి దూరంగా ఉన్నాను అని షాక్ ఇచ్చింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?