Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గత డిసెంబర్ కంప్లీట్ కావడం తెలిసిందే. సీజన్ సిక్స్ రన్నర్ గా శ్రీహాన్ గెలిచాడు. అంతేకాదు 40 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకోవటం జరిగింది. ఇదిలా ఉంటే సీజన్ 5లో టాప్ ఫైవ్ లేడీ కంటెస్టెంట్ సిరి అందరికీ సుపరిచితురాలే. శ్రీహాన్ మరియు సిరి ఇద్దరూ ప్రేమికుల అని అందరికీ తెలుసు. సిరి హౌస్ లో ఉన్న సమయంలో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో శ్రీహాన్ వచ్చాడు. ఇంకా శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ సమయంలో సిరి రావడం జరిగింది. అయితే సిరి.. సీజన్ ఫైవ్ లో చాలా నెగెటివిటీ ఎదుర్కోవడం జరిగింది.

ముఖ్యంగా షణ్ముక్ తో చాలా క్లోజ్ గా ఉండటం ఆమెకు అనేక ఇబ్బందులను తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో శ్రీహన్ కూడా తనకి బ్రేకప్ చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో సిరి తెలియజేసింది. కానీ తర్వాత ఇద్దరు మళ్ళీ కలిసి పోయారు. గతంలో కంటే ఇప్పుడు తమ మధ్య బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయిందని కూడా సిరి చెప్పుకొచ్చింది. అప్పటి పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఇటీవల సిరి బర్తడే నీ శ్రీహన్ చాలా గ్రాండ్ గా కూడా చేశారు. ఇదే సమయంలో ఒక స్పెషల్ రింగ్ కూడా సిరికి తొడగటం జరిగింది.

తన బర్తడే ఇంకా అనేక విషయాలు గురించి తన ఫాలోవర్స్ తో ఇంస్టాగ్రామ్ లో సిరి చిట్ చాట్ చేయడం జరిగింది. ఆ సమయంలో శ్రీహాన్ తో పెళ్లెప్పుడు అని సిరినీ చాలామంది ప్రశ్నించారు. దానికి అతి త్వరలోనే అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మరియు బయటకు వచ్చాక కూడా శ్రీహాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆల్రెడీ శ్రీహాన్ 30 ప్లస్ కావటంతో ఈ ఆడదిలోనే వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.