Chiranjeevi: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో కంటేస్తంట్ గా లేడీ కొరియోగ్రాఫర్ యానీ(Yaani) మాస్టర్ అద్భుతంగా రాణించడం తెలిసిందే. పెద్ద వయసున్న గాని దాదాపు పదకొండు వారాలపాటు.. హౌస్ లో విజయవంతంగా టాస్క్ లు ఆడటం మాత్రమే కాక.. ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడకుండా.. సింగిల్ గా యానీ మాస్టర్ గేమ్ ఆడి ప్రేక్షకులను అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు. ఇదిలా ఉంటే షోలో ఉన్నంత సేపు బయట జరుగుతున్న నెగిటివిటినీ పెద్దగా అంచనా వేయలేకపోయారు. హౌస్ లో తోటి కంటెస్టెంట్ లనీ ఎగతాళి చేయడం.. చేయడంతో బయట తనపై ట్రోలింగ్‌ను చూసి విస్తుపోయింది.
షో ముగిసిందని, ఇంకా తన గురించి తిట్టుకుంటూ టైంపాస్ చేయడం ఆపేయండని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే బయటికి వచ్చాక వరుసబెట్టి సినిమా అవకాశాలు అందుకుంటున్న యానీ.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాలో బోలా శంకర్(Bola Shankar) లో.. ఛాన్స్ వచ్చినట్లు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. జీవితంలో మర్చిపోలేని అనుభూతి అన్నట్టు చెప్పుకొచ్చింది. కాగా ఇది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందే.. అవకాశం వచ్చినట్లు.. సినిమాలో చిరంజీవి.. వెన్నెల కిషోర్(Vennela Kishore) పక్కనే తన పాత్ర ఉంటుందని యానీ మాస్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
సినిమాలో కొరియోగ్రాఫర్ గా కూడా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) కి కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉంటే ఇదే సినిమా లో బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఎంటర్టైనర్ లోబో(Lobo) కూడా నటిస్తున్నాడు. గతంలోనే ఈ విషయాన్ని లోబో చెప్పటం మనం చూశాం. దీంతో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సీజన్ ఫైవ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యానీ, లోబో కనిపించనున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!