Bigg Boss 6: ఎంటర్టైన్మెంట్ కి అడ్డాఫిక్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుల్లితెర పాపులారిటీ షో బిగ్ బాస్.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కొనసాగుతోంది.. ఈ షోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ హౌస్ కి వెళ్ళారు.. ఆటలో భాగంగా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ చివరకు ఆరుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 6 కాంటెస్టెంట్స్ జర్నీ వీడియోలతో ఆట కొనసాగుతోంది.. ఈ షో చివరి దశకు చేరుకోవడంతో కాస్త రసవత్తరంగా మారింది. ఈసారి బిగ్ బాస్ ట్రోఫీ విన్నర్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతుండగా.. బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరు అని గూగుల్ సెర్చింగ్ లో కూడా ట్రెండింగ్ నిలిచింది.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ , రేవంత్ , శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి ఉన్నారు. వీరి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. వీరిలో నుంచి ఇంకొకరు కూడా ఎలిమినేట్ అయ్యే సమయం వచ్చేసింది. మిడ్ వీకెండ్ లో కచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున ఆదివారం రోజే చెప్పారు. అయితే ఈ ఎలిమినేషన్ లో శ్రీ సత్య హౌస్ నుంచి వెళ్ళిపోయిందని టాక్ కూడా వినిపిస్తోంది. ఇక మిగిలిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో బిగ్ బాస్ ఫినాలే లో అడుగుపెట్టనున్నారు.. ఈ ఐదుగురిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. మరోవైపు గూగుల్ సెర్చింగ్ లో కూడా ఇదే సెర్చింగ్ టాప్ లో ఉండటం విశేషం. అయితే గూగుల్ తల్లి మాత్రం ఎవ్వరికి ఇంకా తెలియని బిగ్ బాస్ 6 తెలుగు విన్నర్ ఎవరో చెప్పేస్తుంది.
అయితే గూగుల్ తల్లి బిగ్ బాస్ తెలుగు సిక్స్ విన్నర్ ఎవరు అంటే రోహిత్ అని టెలివిజన్ యాక్టర్ అంటూ చెప్పేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ విన్నర్ అని సెర్చ్ చేస్తే రోహిత్ పేరు చూపిస్తుంది. దీంతో బిగ్ బాస్ విజేత రోహిత్ అనే ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి ఓటింగ్ పరంగా రోహిత్ ముందంజలోనే ఉన్నాడు. రేవంత్ శ్రీహాన్లతో పోటీ పడుతున్నాడు. ఆదిరెడ్డికి కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ఫైనల్ గా గూగుల్ చెప్పినట్లు రోహిత్ బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ గెలుచుకుంటాడా లేదా అనేది చూడాలి..