రాహుల్ సిప్లిగంజ్.. సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. ఆ సీజన్లో చివరి వరకూ బిగ్‌బాస్ హౌస్‌లో నిలిచి.. బుల్లితెర ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖిని వెనక్కినెట్టి.. బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్‌గా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన తరువాత రాహుల్ ఇమేజ్ అమాంతం ఆకాశానికి చేరింది. ఈ క్రమంలోనే సింగర్‌గా అవకాశాలు మరిన్ని రావడంతో పాటు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో మంచి రోల్‌ను పోషించే అవకాశం దక్కించుకున్నాడు రాహుల్. దీంతో పాటు పలు టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు.
కాగా, ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 4 విజయవంతంగా రెండు నెలలు పూర్తిచేసుకుని విజయవంతంగా దూసుకుపోతోంది. మొదట్లో ఈ సీజన్.. అంతగా ఆకట్టుకోకపోయిన ప్రస్తుతం బిగ్‌బాస్ రసపట్టుకు చేరుకుంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించే క్రమంలో ఇదివరకే పలువురు ప్రముఖ కంటెస్టంట్లు సైతం నామినేట్ అయ్యారు. అయితే, బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వారందరినీ.. ఇదివరకటి బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు తమ అనుభవాలను వివరించే పలు ప్రశ్నలు వారిని అడుగుతున్నారు రాహుల్.
ఇదే విషయమై రాహుల్ సిప్లిగంజ్‌పై నటి మోనాల్ గజ్జర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రాహుల్ కక్షపూరితంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్… మోనాల్ గజ్జర్ పై కక్షకట్టారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే, రాహుల్ కక్ష కట్టడమేంటి? ఆయనపై మోనాల్ అభిమానులు ఎందుకు ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగివుంటుంది? సోషల్ మీడియాలో అంతలా ఎందుకు రెచ్చిపోతున్నారు? అనే కదా మీ ప్రశ్నలు… అసలు ఏం జరిగిందంటే..
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్న వారిని ఇంటర్వ్యూ చేసే సందర్భంలో మోనాల్ ఇమేజ్ను దెబ్బతీయడంతో పాటు ఆమెపై నెగటివ్ కామెంట్ చేసే విధంగా రాహుల్ ప్రశ్నలు ఉంటున్నాయని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకూ ఇంటర్వ్యూ చేసిన కంటెస్టంట్లకు సంబంధించిన వీడియోలలో రాహుల్ ప్రవర్తన గురించి ప్రశ్నిస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ హౌస్ నుంచి అనారోగ్యంతో బయటకు వచ్చిన నోయల్‌ను రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా నోయల్‌ను మోనాల్ పై నెటగివ్ కామెంట్ చేసే విధంగా రాహుల్ ప్రేరేపిం చాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోనాల్‌పై రాహుల్ కక్షకట్టారు అంటూ మీమ్స్ తో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.