తుఫాను దెబ్బకు ఆగిన బిగ్ బాస్..? కంటేస్తెంట్స్ అంతా ఇంటి బయటకు…!

నివర్ సైక్లోన్ ఎఫెక్ట్ బిగ్బాస్ ఇంటిదాకా తాకింది. ఈ మధ్య కాలంలో వచ్చిన తుఫానుల అన్నింటిలోకి సైక్లోన్ చాలా ప్రమాదకరమైనది అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెన్నై, దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో భారీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లో బిగ్ బాస్ నాలుగో సీజన్ తమిళ్ అర్థంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి.

చెన్నై మహానగరంలో ఈ తుఫాను ప్రభావం భారీగా ఉంది కాబట్టి ఫిలిం సిటీలో ఉన్న బిగ్ బాస్ సెట్ కు ముంపు ప్రమాదం ఉండడంతో ఇంటిలోని కంటెస్టెంట్స్ అందరిని బయటకు పంపించినట్లు సమాచారం. వీరందరిని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో సురక్షితంగా ఉంచి తదుపరి కార్యాచరణపై నిర్వాహకులు విశ్లేషిస్తున్నారట. ఇకపోతే మరో రెండు రోజులు బిగ్బాస్ టేలికాస్ట్ ఉండకపోవచ్చని అంటున్నారు.

ఈ విషయంపై ప్రస్తుతం అధికారిక సమాచారం ఏమి లేదు కానీ మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే ఇంటి నుండి ముందు జాగ్రత్తగా బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. తమిళ బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి ఇలా అర్ధాంతరంగా షో ఆగి పోవడం ఇదే మొదటి సారి. ఇక తిరిగి టెలికాస్ట్ ఎప్పుడు అవుతుందో తెలియనప్పటికీ ప్రభావం తుఫాను అయితే చాలా గట్టిగానే ఉంది అని అర్థం అవుతోంది.