హమ్మయ్య.. ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభం అయింది. శనివారమే మొదటి ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభం అయింది. దానికి సంబంధించిన టీజర్ ను కూడా మాటీవీ రిలీజ్ చేసింది.
ఆ టీజర్ లో నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. మాస్క్ ముఖానికి అవసరం కానీ.. ఎంటర్ టైన్ మెంట్ కు కాదు.. అంటూ నాగ్ చెప్పడం… బిగ్ బాస్ షోలో ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ లేదని చెప్పడమేనని అర్థం అవుతోంది.
టీజర్ లో డ్యాన్స్ లకు సంబంధించిన కొన్ని సీన్లు చూపించారు. ఇంకా ఎవరో స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నట్టున్నారు కానీ.. ముఖాన్ని రివీల్ చేయలేదు. కంటెస్టెంట్లు కూడా డ్యాన్సులు చేసి ఇరగదీశారు.
మొత్తానికి మన ఇంట్లోకే మరోసారి వినోదం రాబోతున్నది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ షో ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. కంటెస్టెంట్లు కూడా ఇంట్లోకి వెళ్లిపోయారు. మొదటి ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. మిగితా రోజుల్లో అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 కు బిగ్ బాస్ ప్రారంభం కానుండగా… శని, ఆది వారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది.
శని, ఆదివారం.. నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ ను పలకరిస్తాడు. మిగితా రోజుల్లో హౌస్ లో ఏం జరగుతుందో చూపిస్తారు. మొత్తానికి ఎన్నో అడ్డంకులను దాటుకొని బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతున్నదన్నమాట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!