Categories: సినిమా

Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్‌బాస్‌కి స‌ర్వం సిద్ధం.. కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్ట్ ఇదే..!

Share

Bigg Boss Telugu OTT: ప్ర‌పంచ దేశాల్లోనూ స‌క్సెస్ ఫుల్ షోగా గుర్తింపు పొందిన బిగ్‌బాస్.. తెలుగులోనూ భారీ ఆద‌ర‌ణ‌ ద‌క్కించుకుంది. ఇప్ప‌టికే ఇక్క‌డ ఐదు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. త్వ‌ర‌లోనే ఓటీటీ వేదిక‌గా ప్రేక్ష‌కుల‌ను 24/7 అల‌రించేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 26 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ షో స్ట్రీమింగ్ షురూ కానుంది.

ఇందుకు స‌ర్వం సిద్ధం చేసిన మేక‌ర్స్‌.. ప్ర‌స్తుతం షోపై భారీ హైప్ క్రియేట్ అయ్యేందుకు జోరుగా ప్ర‌మోషన్స్ నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు ఓటీటీ బిగ్‌బాస్ లో పాల్గొన‌బోయే ఫైన‌ల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ ఈ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్రకారం.. ఈ షోలో హీరోయిన్ బిందు మాధ‌వి, కమెడియన్ ధనరాజ్, ఆదర్శ్, ముమైత్ ఖాన్, రోల్‌ రైడా, తేజస్వి, అషు రెడ్డి, అరియానా గ్లోరి, మహేశ్‌ విట్టా ఈ షోలో పాల్గొన‌బోతున్నారు.

అలాగే వీరితో పాటు సరయు, హమీదా, నటరాజ్ మాస్టర్, యాంకర్ నిఖిల్ , యాంకర్ శివ , చిచ్చా చార్లెస్‌, అజయ్‌ కతుర్వార్‌, యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతులు ఓటీటీ బిగ్‌బాస్‌లో అల‌రించ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి వీరిలో ఎంత మంది బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్ట‌బోతున్నారు అన్న‌ది తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇదిలా ఉంటే.. ఓటీటీ బిగ్‌బాస్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం లేదంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, ఆయ‌న స్థానాన్ని యాంక‌ర్ ర‌వి బ‌ర్తీ చేయ‌నున్నాడ‌ని కూడా టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

 


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

26 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

50 mins ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

3 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

5 hours ago