25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Bigg Boss: బిగ్ బాస్ స్టేజ్ పై సీరియల్ స్టార్స్ సందడి.. కంటెస్టెంట్స్ సీక్రెట్స్ రివిల్.!

Bigg Boss Telugu season 6 serial stars mesmerizing memories
Share

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 మొదలై చాలా కాలం అయింది. తొందరలో ఈ సీజన్ ఫైనల్ స్టేజ్ కి చేరుకొనుంది. ఇప్పటివరకు 83 ఎపిసోడ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆరవ సీజన్ లో 12వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ లో ఏడుగురు ఉన్నారు. నిన్న శనివారం జరిగిన ఎపిసోడ్ ఇన్ని వారాలలో జరిగిన ఎపిసోడ్స్ కంటే హైలెట్ గా నిలిచింది. ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ సంబంధించిన వ్యక్తులతో పాటు సీరియల్, మూవీ స్టార్స్ వచ్చి సందడి చేశారు. ఎపిసోడ్ అంతా నవ్వులు పూయించారు..

Bigg Boss Telugu season 6 serial stars mesmerizing memories
Bigg Boss Telugu season 6 serial stars mesmerizing memories

ఇనయ కోసం తన తమ్ముడు, సోహెల్ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. సోహెల్ ఇనయ లవ్ ట్రాక్ తనే బయట పెట్టింది. ఇండియాకి హౌస్ లో కాంపిటేటర్ గా రేవంత్ ని సెలెక్ట్ చేయగా.. ఆదిరెడ్డిని కాంపిటేటర్ కాదని తేల్చారు. మధ్యలో శ్రీహాన్ సిరి లావు ట్రాక్ ని సోహెల్ ప్రస్తావించాడు. శ్రీహన్ కోసం వాళ్ళ నాన్నతో పాటు బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివ బాలాజీ కూడా వచ్చారు. సిరిని ఇంట్లో ఎలా పరిచయం చేశాడు అంటూ వాళ్ళిద్దరికీ తెలియని ఆసక్తి విషయాలను స్టేజ్ పై పంచుకున్నారు. శ్రీహానికి కాంపిటేటర్ గా రేవంత్ ని చెప్పిన శివ బాలాజీ ఫైమా తనకి అసలు కాంపిటీషన్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఫైమా కోసం తన అక్క, బుల్లెట్ భాస్కర్ ఇద్దరు వచ్చారు. బుల్లెట్ భాస్కర్ తనదైన శైలిలో పంచులు వేసి అందర్నీ నవ్వించాడు. ఇనయాపై వరస కౌంటర్స్ వేశాడు. ఫైమాకి ఇనయ కాంపిటీషన్ అని శ్రీ సత్య అసలు కాంపిటీషన్ కాదని బుల్లెట్ భాస్కర్ చెప్పారు. రేవంత్ కోసం అతని అన్నయ్య రోల్ రైడా వచ్చారు. రేవంత్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను చర్చించారు. ఆది రెడ్డి కోసం అతని చెల్లెలు నాగలక్ష్మి నటి లహరి వచ్చారు. కళ్ళు కనిపెంచని నాగలక్ష్మి ని నాగార్జున స్వయంగా వెళ్లి చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకువచ్చారు. ఇక నాగలక్ష్మి నిన్నటి ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

శ్రీ సత్య కోసం తన ఫ్రెండ్ హారిక సీరియల్ నటి విష్ణు వచ్చారు. శ్రీ సత్య ఎప్పుడు తింటూ ఉంటుందని.. ఫోన్ లేకుండా ఉండలేదని హారిక చెప్పింది. రాజు కోసం డాక్టర్ వెంకీ, సాయి రోణక్ వచ్చారు. బయట చాలా సైలెంట్ అని తను బయట ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అలాగే ఉన్నాడని చెప్పుకొచ్చారు. రాజ్ కి రోహిత్ కాంపిటీషన్ అతనికి కాంపిటీషన్ లేదని చెప్పారు కీర్తి కోసం సీరియల్ నటి ప్రియాంక , వితిక శేరు వచ్చారు నీకు ఎవరు లేరని బాధపడుతూ ధైర్యం చెప్పి.. తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. శ్రీహన్ తనకి కాంపిటేషన్ అనే శ్రీ సత్య కి కాంపిటీషన్ కాదని వాళ్లు చెప్పారు. రోహిత్ కోసం అతని సోదరులు డింపు టాలీవుడ్ మెగాస్టార్ గా అభిమానులు సరదాగా పిలుచుకునే ప్రభాకర్ వచ్చాడు సీరియల్ నటుడు ప్రభాస్ రోహిత్ కి కాంపిటేటర్ గా రేవంత్ అని రాజ్ అతనికి కాంపిటేటర్ కాదని చెప్పుకొచ్చారు .ఈ వారం నామినేషన్ లో ఇంకా నలుగురు ఉన్నారు. వారిలో శ్రీ సత్య, ఇనయ, శ్రీహన్ సేఫ్ ఆయ్యారు. ఫైమా, రోహిత్, ఆదిరెడ్డి , రాజ్ గా అన్ సేఫ్ గా మిగిలిపోయారు.


Share

Related posts

Pawan kalyan : పవన్ కళ్యాణ్ నా గుండె మీకోసం కొట్టుకుంటుంది..!

GRK

Today Gold Rate: పైపైకి కదిలిన బంగారం.. భారీగా పడిపోయిన వెండి..!!

bharani jella

Suez Canal : కాలువలో నౌక చిక్కుకుంది..! ప్రపంచం రోజుకి రూ. 70 వేల కోట్లు నష్టపోతోంది..!!

Srinivas Manem