స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ షో లో బిగ్ బాస్ కంటస్టెంట్స్ కి బేబీ డే టాస్క్ ఇవ్వగా ఆ టాస్క్ లో కంటెస్టెంట్స్ తమ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. చిలిపి చేష్టలు, ఏడుపులు, అల్లరితో మరింత ఫన్ జెనరేట్ చేస్తున్నారు. అయితే 52వ రోజు కంటెస్టెంట్ లలో కొంతమంది చిన్నపిల్లలుగా మారడం, కేర్ టేకర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం కొంచెం ఇబ్బంది కరంగా మారింది.
టాస్క్ లో భాగంగా మాస్టర్ జేబులో ఉన్న చాక్లెట్ ను హారిక దొంగతనం చేస్తుంది. దీంతో కేర్ టేకర్ గా ఉన్న అభిజిత్ ఆగ్రహం తో ఊగిపోతాడు. జేబులో ఉన్న చాక్లెట్ తీసుకుంటే అది దొంగతనమా..? లాక్కోవడమా అంటూ హారికను అరుస్తాడు. చాక్లెట్ తీసుకున్న కోపంలో అభి.., హారిక గొంతు పట్టుకుంటాడు. అదే విషయాన్ని లాస్య, నోయల్ తో చెప్తాడు. దీంతో తాను చాక్లెట్ ను దొంగతనం చేశానని హారిక సారీ చెబుతుంది. కానీ అభి ఏమాత్రం రెస్పాండ్ కాకపోవడంతో..తాను దొంగతనం చేసే సమయంలో ఎందుకు అడగలేదని హారిక.., అభిజిత్ ను ప్రశ్నిస్తుంది. నేను ఏం మాట్లాడాలో నాకు తెలుసు నువ్వు చెప్పకు..అయినా నీతో మాట్లాడడం అనవసరం అంటూ అభి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
హారిక క్షమాపణలు చెప్పి గొడవకు కారణమైన చాక్లెట్ ను మాస్టర్ కు ఇస్తుంది. తర్వాత రోజు అదే హారిక రాత్రి అందరూ పడుకున్న తరువాత లాస్య చాక్లెట్ దొంగిలిస్తుంది. మరుసటిరోజు ఉదయం తన చాక్లెట్ కనిపించడం లేదని కంగారు పడిన లాస్యకు..హారిక రాత్రి నీ చాక్లెట్ దొంగతనం చేయడం తాను చూసినట్లు అవినాష్ చెప్తాడు. తన చాక్లెట్ ఇవ్వాలని లాస్య అడగడంతో హారిక తిరిగి ఇచ్చేస్తుంది. ఇక సోహైల్.., ఆరియానాను కన్విన్స్ చేయడం, మహబూబ్..,సొహైల్ ను కొరకడం, మోనాల్ కు క్లాస్ చెప్పేందుకు అఖిల్ బోర్డ్ మీద బొమ్మలేయడం, క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే లవ్ అంటే మోనాల్ అని అవినాష్ ప్రేమ పాఠాలు వల్లివేయడం లాంటి టాస్క్ లు బాగున్నాయి.
కానీ బిగ్ బాస్ లో సోయల్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. భుజాల్ని కదిలించలేకపోతున్నాడు. మెడనరాలు పట్టేశాయి. కాళ్లు నడవడానికి వీల్లేకపోవడంతో రాత్రంతా నిద్రపోలేకపోయాడు. బిగ్‌బాస్ కూడా అనారోగ్యం కారణంగా నోయల్‌కు విశ్రాంతి కల్పించాడు. దీంతో నోయల్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాక్టర్ గా , ర్యాపర్ గా ఆడియన్స్ ను సొంతం చేసుకున్న నోయల్ ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్ కు బిగ్ బాస్ రెస్ట్ కంటిన్యూ చేస్తాడా.., లేదంటే ఆరోగ్యం ఎలా ఉందనేది బిగ్ బాస్ 53వ రోజు తెలుస్తుంది.