బిగ్ బాస్ 4 : మోనాల్ దృష్టిలో A అంటే అవినాష్ అట..! ముద్దు కూడా పెట్టేసింది…

బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదటినుండి లవ్ ట్రాక్ ల పై నిర్వాహకులు చూపిస్తున్న ఇంటరెస్ట్ అందరికీ తెలిసిందే. గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ – పునర్ణవి కి ఇచ్చిన హైప్ ఇప్పటికీ బుల్లితెరపై మారుమోగుతూనే ఉంది. ఇక ఈ సారి మోనాల్ ను సెంటర్ లో పెట్టి అఖిల్, అభిజిత్ మధ్య జరిగిన గొడవలు గురించి తెలిసిందే.

 

వీరిద్దరిని కవర్ చేయడంలో మోనాల్ మొదట్లో సఫలం అయినప్పటికీ తర్వాత అభిజిత్ తో క్రమంగా దూరం అయిపోయింది. ఇక అఖిల్ ఆమెకు బాగా దగ్గరయ్యాడు. స్టేజి పైన హోస్ట్ లు A అనే మోనాల్ కి అక్షరం బాగా ఇష్టం అని అనడంతో జనాల్లో ఇది బాగా నాటుకుపోయింది. ఇదే సమయంలో ఇంటిలో మంచి పేరున్న హౌస్ మెట్ కమెడియన్ ముక్కు అవినాష్ కి మోనాల్ ముద్దు పెట్టడం చర్చనీయాంశం అయింది.

అవినాష్ కూడా ఎగిరి గంతేసి నా పొలంలో మొలకలు వచ్చాయి… మోనాల్ దృష్టి లో ఉన్న A అంటే అవినాష్ అని ప్రకటించుకున్నాడు. అవునా నిజమా అంటూ కుర్చీలో క కామ్ గా కూర్చుని అఖిల్ చూస్తున్నాడు. అయితే ఇదంతా చాలా కామెడీగా జరిగినట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే మోనాల్ అవినాష్ కి ముద్దు అరియానా పక్కనే కూడా ఉంది. వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు క్రియేట్ a తంటాలు ఆరియానా మాత్రం తనకు బయట ఒకడు ఉన్నట్లు మొన్న తేల్చి చెప్పేసింది. ఇక మోనాల్ అవినాష్ కు కామెడీగానే ముద్దు పెట్టింది అని ప్రోమో లో స్పష్టంగా తెలుస్తోంది.