బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అందానికి కొదవేమీ లేదు. దివి, హారిక, అరియానా, మోనాల్ వంటి యువ అందగత్తెలతో హౌస్ అంతా నిండిపోయింది. ఒకరకంగా స్కిన్ షో చేయడంలో తప్పులేదు కానీ జనాలను ఆకట్టుకోవడానికి మాత్రమే పరిమమైతే పద్ధతిగా ఉంటుంది. అయితే అందులో హద్దులు ఉంటాయి. ఆ పరిధి మేర ఎంత చేసినా ఎవరికీ ఏమీ అనిపించాడు. ప్రేక్షకులు కూడా వాటిని సరిగ్గానే తీసుకుంటారు.
అయితే బిగ్బాస్ అనేది ఫ్యామిలీ మొత్తం చూసే షో. అదికాక రెండు రాష్ట్రాల్లోని ప్రజలు హాలీవుడ్ బాలీవుడ్ తో పోలిస్తే కొన్ని విపరీత అంశాలకు నొచ్చుకుంటారు. కానీ మోనాల్ మాత్రం తన అందాలతో తిరుగులేని అస్త్రాలను వదులుతోంది. మామూలుగా పద్ధతిగానే ఇంటిలో డ్రెస్ వేసుకునే మోనాల్ వీకెండ్ ఎపిసోడ్ వస్తే మాత్రం రెచ్చిపోతుంది. అందాల ఆరబోతలో తనను మించిన వారు లేరు అన్నట్లు చేస్తుంది. ఒక రెండు మూడు వారాల క్రితం మోనాల్ వేసుకున్న డ్రెస్ ఎంత అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆమె వేసుకున్న డ్రెస్ ఎక్స్ పోజింగ్ కు ఐదవ వారంలో సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ మోత మోగిపోయింది. ఓట్లకోసం ఇలాంటివి చేస్తావా అంటూ విరుచుకుపడ్డారు. ఇక సుజాత, కరాటే కళ్యాణి అయితే ఆమె లాగా మేము బట్టలు వేసుకోము కాబట్టి మమ్మల్ని ఎలిమినేట్ చేశారు అని బయటకు వచ్చి విరుచుకుపడ్డారు. ఆమె వాళ్లకు కావాల్సినవి చేస్తుంది కాబట్టి ఆమెను ఉంచుతారు అని కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇక ఈ వారం ఎపిసోడ్ లో కూడా అలాంటి డ్రెస్ ఇవ్వడంతో జనాలు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. మోనాల్ ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!