బిగ్బాస్ వారాంతపు ఎపిసోడ్ లలో అక్కినేని నాగార్జున ప్రతి సారి మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. శనివారం ఊహించని టాస్క్ లను ఇస్తూ.. అలాగే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన కంటెంట్స్ పై విపరీతంగా విరుచుకు పడతాడు మన్మధుడు. ఇక ఆదివారం వారిని కూల్ చేసే ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు. ఇదంతా జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ తెచ్చిపెడుతోంది.
ఇదే క్రమంలో ఈ శనివారం ఎపిసోడ్ లో ఎవరూ ఊహించని విధంగా నాగార్జున బాంబు పేల్చాడు. ఇప్పటి వరకు చేయని ఒక టాస్క్ ఉందని షాక్ ఇచ్చేసాడు. ఇటీవల బిగ్బాస్ కొన్ని అసాధారణ టాస్క్ లను ఇచ్చిన విషయం తెలిసిందే. హారిక సగం జుట్టు కత్తిరించుకునే టాస్క్ తీసుకుంది. సగం జుట్టు కత్తిరించడం పెద్ద రిస్క్ ఏమీ కాదు. అయితే ఇదే యాంగిల్ లో నాగార్జున ఊహించని షాక్ ఇచ్చాడు. నిలువుగా సగం గుండు తరహాలో హెయిర్ కట్ చేసుకోవాలని మీసాలు కూడా అలాగే సగంగా చేసుకోవాలని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ
డియన్స్ వారు ఏమి విన్నారో నమ్మలేకపోతున్నారు. ఇక కంటెస్టెంట్స్ గుండెల్లో అయితే రైళ్లు పరిగెత్తాయి అని చెప్పవచ్చు. ఇక దీనికి మొదటి సారి ఎంతో ధైర్యంగా అమ్మరాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ పని చేసిన వారు నెక్స్ట్ వీక్ నామినేషన్ నుండి అవుతాడు అని నాగార్జున చెప్పడం కొసమెరుపు. ఇలా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో నరాలు తెగే ఉత్కంఠ కలిగించింది. ఇక్కడ అన్నిటికన్నా షాక్ ఏమిటంటే అమ్మరాజశేఖర్ దీనికి ఒప్పుకొని కంటతడి పెట్టుకున్నాడు. నోయల్ చేత ట్రిమ్మర్ తెప్పించి అమ్మ రాజశేఖర్ జుట్టు తీసివేయమని చెప్పాడు నాగ్. రాజశేఖర్ కి అతని జుట్టు అంటే ఎంత ఇష్టమో ఇంటిలో అందరికీ తెలుసు. కెమెరా వైపు సీనంగా చూసి చిన్న పిల్లల్లాగా రాజశేఖర్ ఏడ్చేశాడు.