22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : గంగవ్వ లా మరో కంటెస్టెంట్ బయటకు..! జరిగిన ప్రమాదం అలాంటిది మరి

Share

బిగ్బాస్ ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చలామణి అవుతున్న అభిజిత్ కు ఒక మైనస్ పాయింట్ ఉంది. అతడు ఫిజికల్ టాస్క్ అంటే చాలు చాలా దూరంగా ఉంటాడు. అతని భుజానికి అయిన గాయం కారణంగానే అతడు ఫిజికల్ టాస్కు లు అంటే అంటీ అంటనట్టు ఉంటున్నాడు అని అతని మద్దతుదారులు కామెంట్లు చేస్తుంటారు. అభిజిత్ రేసర్ అని ఓ ప్రమాదంలో భుజానికి గాయం అయింది అన్న ఫోటోలు వార్తలు వైరల్ అయిపోయాయి.

 

ఇక మొదటి సారి అభిజిత్ తన 100% శక్తిని ఉపయోగించి ఫిజికల్ టాస్క్ ఆడితే అది కాస్తా బెడిసికొట్టింది. బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో టిప్ కోసం బాగా శ్రమించిన అభిజిత్ ఫిజికల్ టాస్క్ లలో అడ్డుపడడం, లాగడం వంటివి మాత్రం చేయడు. ఈ విషయంలో ఇతని పట్ల నెటిజన్ల మధ్య అసంతృప్తి చాలానే ఉంది. ఇక తాజాగా ఒక టాస్క్ లో పార్టిసిపేట్ చేశాడు. రన్, ఫైర్, వాటర్ అంటూ సోహెల్ అందరినీ ఒక ఆట ఆడించారు. రన్ అంటే గార్డెన్ ఏరియాలో ఉన్న నల్ల మ్యాట్ దగ్గరకు చేరుకోవాలి. ఫైర్ అంటే ఎర్ర మ్యాట్ దగ్గరకు చేరుకోవాలి. వాటర్ అంటే స్విమ్మింగ్ పూల్ లో దూకాలి.

ఇలా వారిని పరిగెత్తిస్తున్న అప్పుడు స్విమ్మింగ్ పూల్ లో అందరూ దూకారు అక్కడినుండి రన్ అనడంతో వెళ్లి బ్లాక్ మ్యాట్ పై నిలబడ్డారు. ఈ సమయంలో అభిజిత్ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ రావడంతో ఒక్కసారిగా జారి పడిపోయాడు. ఇక అభి తో పాటు మరొక మనిషి కూడా కిందపడినట్లు కనిపిస్తోంది. అభిజిత్ కి ఒకరకంగా బాగానే గాయాలు తగిలి ఉంటాయని చూస్తే అర్థమవుతుంది.

ఇప్పటికే తన కుడి భుజం గాయం కావడంతో ఫిజికల్ టాస్క్ లకి దూరమైనా అభిజిత్ దీనివల్ల హౌస్ కు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అతని చేయి బాగాలేకపోతే ఎటువంటి ఫిజికల్ చేయలేడు. మొత్తానికి డాక్టర్ వచ్చి అతనిని పరీక్షిస్తాడు కానీ అతను మిగతా సీజన్ మొత్తం కొనసాగుతాడా లేదా అన్నది చూడాలి. ఒకవేళ జరగరానిది జరిగితే అతను ఇంటికి వెళ్లి పోక తప్పదు.


Share

Related posts

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ కోసం ప్రేమ‌క‌థ‌

Siva Prasad

Nani: నాని కెరీర్‌లోనే ఇలాంటి సాలీడ్ ఆఫర్ మొదటిసారి..

GRK

రిలీజ్ అయిన కేజిఫ్ 2 టీజర్!!

Naina