బిగ్ బాస్ నాలుగో సీజన్ దిగ్విజయంగా కొనసాగుతోంది. లవ్ ట్రాక్ లతో కొన్ని ఎపిసోడ్లు హైలైట్ అవుతున్నాయి కానీ కొన్ని మాత్రం బోర్ కొట్టిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా నెటిజన్లకు మోనాల్ ప్రవర్తన పెద్దగా నచ్చలేదు. ఆమె వల్ల ఇంట్లో అందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా ఏమీ లేదు.
అదే సమయంలో మరొక గ్లామర్ డాల్ అయిన అరియానా గ్లొరీ మాత్రం ఫిజికల్ టాస్క్ లలో ఇరగదీస్తోంది. తాజాగా జరిగిన చిన్నపిల్లల టాస్క్ లో కూడా బెస్ట్ ఫార్మర్ గా ఎన్నికయింది. ఇక అరియానా, అవినాష్ మధ్య ఉన్నట్లు మొదట్లో కొద్దిగా హడావిడి చేశారు కానీ అరియానా మాత్రం లిమిట్ లో ఉంటూ వచ్చింది. అవినాష్ కూడా అందరితో కామెడీ గా మాట్లాడుతున్నాడు తప్ప ఏ సంబంధాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.
అయితే దసరా ఎపిసోడ్ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ నేమ్ ను అరియానా లీక్ చేసినట్లు చెబుతున్నారు. హైపర్ ఆది అడిగిన ప్రశ్నలకు తనకు ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ వున్నాడు అని చెప్పిన అరియానా అతని పేరును కూడా పొరపాటున బయటికి అనేసింది అనే వార్తలు వస్తున్నాయి. అంతకుముందు కుటుంబ సభ్యులు వీడియోలు చూపించినప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయిన అరియానా… ఆర్వి నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం మూడేళ్లు నీతో ఉన్నాను నిన్ను ఇంతలా ఎప్పుడు మిస్ కాలేదు అని కంట తడి పెట్టుకుంది.
ఇక ఆ స్పెషల్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. వినీత్ నాతో 12 ఏళ్లుగా ఫ్రెండ్ గా ఉన్నాడు. బయటికి వచ్చాక మొదటి ఫోన్ కాల్ నీకే చేస్తాను అని ఆమె ఒక సందర్భంలో అనేసింది. ఆర్వీ అంటే వినీత్ అని.. ఆర్.వినీత్ అతని పేరు అని నెటిజన్లు అంటున్నారు. మరి అరియానా ఇంతలా కలవరిస్తున్న ఆ లక్కీ ఫెల్లో ఎవరో చూడాలి.