బిగ్ బాస్ నాలుగవ సీజన్ క్యాప్షన్ ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అని. అందుకు తగ్గట్టుగానే అందులోని కంటెస్టెంట్స్ బాగా పర్ఫార్మెన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇంటికి హైలైట్ గా నిలుస్తుంది జబర్దస్త్ ముక్కు అవినాష్ కామెడీ. మరోవైపు అమ్మ రాజశేఖర్ కూడా తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ ఉన్నాడు. అయితే అతని కామెడీ వల్ల కొంత మంది నొచ్చుకున్న కారణంగా కొద్ది రోజుల గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మళ్లీ అవినాష్ తో కలిసి ఇంట్లో సందడి మొదలు పెట్టాడు.
మొదటిగా హారిక ఒక గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని కిచెన్ ఏరియా లో అడుగుపెడుతుంది. అప్పుడు ఆమెను చూసి అందరూ భలే ఉన్నావు అని అన్న వెంటనే అవినాష్ అఖిల్ నువ్వే భలే ఉన్నావు అని అంటాడు. ఆ తర్వాత డిజైనర్ ఎవరు అని అన్నప్పుడు హారిక ఏమో నాకు తెలియదు అని అంటుంది. అప్పుడు అవినాష్… లాస్య నిన్నే అడిగేది డిజైనర్ ఎవరు అని అంటాడు. ఇలా ప్రతిసారి నువ్వు చాలా బాగున్నావు నీ డ్రెస్ చాలా బాగుంది అని అనేసి తర్వాత ఆమెను కాదు పక్కన వాళ్ళని అడుగుతున్నట్లు ఆట పట్టించారు.
చివరికి అవినాష్ నిజంగా నువ్వు చాలా బాగున్నావు అని అన్నప్పుడు… హారిక మీరు మళ్ళీ నన్ను కాదు అని అంటారు అందుకే నేను సమాధానం చెప్పను అని ఇప్పుడు చెప్పింది కూడా నీకు కాదు అమ్మ రాజశేఖర్ కి అని అవినాష్ అని అనడంతో ఒకసారి హారిక చిన్నబోతుంది. అలాగే నియల్ డ్రెస్ విషయంలో కూడా అవినాష్, అమ్మ రాజశేఖర్ కామెంట్లు చేస్తుంటే నోయల్ కూడా వారికి తగ్గట్టుగా స్పందిస్తూ కామెడీ పండించాడు. చివరికి మోనాల్ దగ్గరికి వెళ్లి ఆమెతో వెటకారం చేస్తే ఆమె.ముద్దుగా బిగ్ బాస్ కు కంప్లైంట్ చేస్తుంది.