బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదలైన తర్వాత కంటెస్టెంట్స్ లిస్ట్ విషయంలో ప్రేక్షకులు బాగా నిరుత్సాహపడ్డారు. అయితే వారందరికీ బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్ మాత్రం ఎలాంటి సందేహం లేకుండా గంగవ్వ అనే చెప్పాలి. ఇప్పటివరకు గంగవ్వ పై ఒక్క కంప్లైంట్ లేదు…. నెగిటివ్ కామెంట్స్ కూడా అందుకోలేదు. ఎలిమినేషన్ లో డేంజర్ కు జోన్ కు రాలేదు. నామినేషన్ ప్రక్రియ లో కూడా ఆడియన్స్ ఆమెను ఇంటి నుండి బయటకు పంపించలేదు.
కేవలం తన సొంత నిర్ణయంతో 35 రోజులు ఇంట్లో విజయవంతంగా పూర్తి చేసి బయటకు వచ్చింది. అయితే ఆమెకు రావలసిన రెమ్యూనరేషన్ విషయంపై గంగవ్వ ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది. ఇంటి నుండి బయటకు రాగానే ఆమెను కలవడానికి చాలామంది సెలబ్రిటీలు వచ్చారు అని చెప్పింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ లో 35 రోజుల పాటు ఉన్న గంగవ్వ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారు అన్న విషయం పై కొన్ని రోజులు సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది.
పది లక్షల వరకు ఆమెకు పారితోషికం ఇచ్చారని.. హోస్ట్ నాగార్జున మరో ఐదు లక్షలు ఎక్కువ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ గంగవ్వ తప్పు అని కొట్టిపారేసింది. తనకు ఇప్పటి వరకు బిగ్బాస్ లో ఉన్నందుకు ఒక్క రూపాయి కూడా రాలేదని…. అయితే వాళ్లు కచ్చితంగా ఇల్లు ఇస్తానని చెప్పినట్లు చెప్పింది. అలాగే ఇల్లు లేకపోతే మరొక విధంగా కూడా సహాయం చేస్తారు అని నమ్మకం వ్యక్తం చేసింది.
అవ్వ కు పారితోషికం కాకుండా ఇలా ఇల్లు, ఇతరత్రా సాయం చేస్తున్న షో నిర్వాహకుల నిజ స్వరూపం తెలుసుకొని ఆడియన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.