బిగ్ బాస్ 4 : తన ఎలిమినేషన్ కి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకొని మరీ వెళ్ళిన దివి..!

బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఏడవ వారం ముగిసిపోయింది. గత వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ ద్వారా ఎలిమినేషన్ లో దివి అవుట్ అయింది. ఇక దివి ఎలిమినేట్ కావడంతో అభిజిత్, నోయల్, అవినాష్, మోనాల్, ఆరియానా సేవ్ అయ్యారు. ఇక ప్రేక్షకులందరూ దివి ఎలిమినేషన్ తో షాక్ అయ్యారు. ముఖ్యంగా హోస్ట్ గా వ్యవహరించిన సమంత… దివి ఎలిమినేట్ కావడంతో చాలా భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది.

 

ఇక లాస్య, దివి మధ్య జరిగిన చర్చలో దివి తనను తానే స్వయంగా నామినేట్ చేసుకుంది. దసరా సందర్భంగా జరిగిన స్పెషల్ ఎపిసోడ్ లో లో సమంత ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది. జోకులు, ఆటలు పాటలతో ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తుతూ ఒకరి తర్వాత ఒకరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చింది. చివరకు అవినాష్, దివి మిగిలారు. ఇక వీరిద్దరూ ఉండగానే అందరూ దివి ఎలిమినేట్ అయిపోతుందని ఫిక్స్ అయ్యారు కానీ ఆమె ఎలిమినేషన్ అందరికీ షాక్ అనే చెప్పాలి. చివరి నిమిషం వరకు ఈవారం ఎలిమినేషన్ లేకపోతే బాగుండు అని అందరూ అనుకున్నారు.

దివ్య ఎలిమినేషన్ ద్వారా చాలా మంది సభ్యులు ఎమోషనల్ అయ్యారు. అమ్మరాజశేఖర్ అయితే కంటతడి పెట్టారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇంటి సభ్యులు తో సెల్ఫీ దిగిన దివి సమంత ను వేదిక కలిసింది ఆమెను కార్తికేయ సాదరంగా ఆహ్వానించాడు. ఇక సమంత తో జత జతకలిసిన దివి ను కార్తికేయ ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే దివితో పాటు సమంత కూడా భావోద్వేగానికి గురి అయింది. ఇక ఆనవాయితీ ప్రకారం వారం రోజుల పాటు లాస్య వంట చేయాల్సిందిగా బిగ్ బాంబు వేసింది. ఆమెకు అభిజిత్ సహాయం అందించాలని సమంత సూచించింది