బిగ్ బాస్ 4 : ఓటింగ్ సిస్టమ్ పై సర్వత్రా విమర్శలు..! ఈ సారి ఈ కంటెస్టెంట్ ని టార్గెట్ చేశారట

గత మూడేళ్ల నుండి చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ షో లో ప్రతి సీజన్లో ఒకరిని హైలెట్ చేయడం మామూలే. అయితే రెండవ సీజన్ లో కౌశల్ కు వచ్చిన అంత ఫాలోయింగ్ ఇప్పటివరకు బిగ్బాస్ తెలుగు చరిత్రలో ఎవరికీ రాలేదు అనే చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కు ఆర్మీ ఏర్పాటు కావడం అనేది కూడా అదే మొదటిసారి. ఇక గత సీజన్లో శ్రీముఖి బాగా పాపులర్ అయినప్పటికీ రాహుల్ కి టైటిల్ ఇవ్వడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

ఇలా ప్రతి సీజన్లో ఒక కంటెస్టెంట్ హైలెట్ అవుతూ ఉండే ఈ షో లో నాలుగో సీజన్ మిగతా సీజన్ల తో పోలిస్తే బాగా రేటింగ్ లను అందుకుంటోంది. ఇక అదే సమయంలో పలు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది అనుకోండి. ఇంతకీ విషయం ఏమిటంటే…. బిగ్బాస్ నిర్వాహకులు ఒక కంటెంట్ విషయంలో వేసిన ప్లాన్ లీక్ అయిందట. ఇప్పటికే ఈ సీజన్లో మంచి కంటెస్టెంట్ లు గా పేరున్న దేవి నాగవల్లి, దివి ఎలిమినేట్ అయిన విధానం పైన ఎన్నో సందేహాలు ఉన్నాయి.

వారికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ ఉన్నప్పటికీ షో నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఈ పరిణామాలను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. నిజాయితీగా ఎలిమినేట్ కావడం ఏమిటని సిస్టమ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వారి అవసరాలకు తగ్గట్టు మోనాల్, మెహబూబ్. వంటివారిని కాపాడుతున్నారు అన్నన టాక్ కూడా వినిపిస్తోంది. ఇక షో కూడా ప్లాన్ తో ప్రసారం చేస్తున్నారు అని మరి కొందరు అంటున్నారు.

ఈ వారం అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ కాబోతున్నాడని తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఈ వారం మొత్తం అతనిని హైలైట్ చేసి చూపించారని అంటున్నారు. అతను పలువురితో గొడవపడడాన్ని చూపించి అతనిని ఇంటి నుండి బయటకు పంపే ప్లాన్ వేశారని విమర్శలు వస్తున్నాయి.