బిగ్ బాస్ 4 : అఖిల్ ప్యాంటులో ఐస్ ముక్కలు..! మోనాల్ తో స్విమ్మింగ్ పూల్ లో… వామ్మో ఏమి రొమాన్స్….

బిగ్ బాస్ ఇంటిలో నాలుగవ రోజు ఇంటి సభ్యుల ప్రవర్తనను బట్టి వారిని జంటలుగా విడదీసి బిగ్ బాస్ ఒక గేమ్ ఆడించాడు. అఖిల్-మోనాల్ జంటకు అహంకారాలు జంట అని పేరు పెడుతూ మెడలో ట్యాగ్ లు వేసారు. ఈ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు వారిని ఎంతైనా ఇబ్బంది పెట్టవచ్చు కానీ వారు మాత్రం కోపం ప్రదర్శించకూడదు. ఇక వారికి కోపం తెప్పించే ప్రయత్నంలో ఇంటి సభ్య్లు ఏమైనా చేయవచ్చని బిగ్బాస్ సూచించాడు.

 

దీంతో ప్రతి ఒక్కరు అఖిల్, మోనాల్ లను టార్గెట్ చేశారు. అయితే టాస్క్ ప్రకారం వారు ఎలాంటి సమయంలో కూడా కోపం తెచ్చుకోకూడదు. ఈ సమయంలో అఖిల్ కు సోహైల్ బాగా చిరాకు తెప్పించాడు .నేను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. వెంటనే మెహబూబ్ రంగంలోకి దిగి అఖిల్ బట్టలు విప్పాలి అంటూ వెంట పడ్డాడు. ఆ తర్వాత వారికి అమ్మరాజశేఖర్ జతకలిశాడు.

ముగ్గురు కలిసి అఖిల్ ను విసిగించేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా అఖిల్ ప్యాంటు లో అమ్మరాజశేఖర్ ఐస్ ముక్కలు వేసాడు. వెనకనుండి ఐస్ ముక్కలు వేసి చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఆ చల్లదనాన్ని తట్టుకోలేక అఖిల్ పరుగులు పెట్టాడు. ఆ తర్వాత మోనాల్ తలపై బాటిల్ తో అవినాష్ నీళ్ళు పోసాడు.

ఇక వారిద్దరినీ స్విమ్మింగ్ పూల్ లోకి తోసేశారు. అఖిల్ నీటిలో ఉన్న దానిని బయటకు విసిరేస్తే కోపం వచ్చేసింది అని అందరూ అన్నారు. అలాగే కోడిగుడ్లను కొట్టి ఆ జంట తలపై పోసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో మోనాల్ ను కాపాడుతూ అఖిల్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. మోనాల్ తల పైన గుడ్డు పడకుండా అఖిల్ జాగ్రత్త తీసుకుంటే ఆ సన్నివేశం రొమాంటిక్ గా అనిపించింది.