బిగ్ బాస్ 4 : ఇంటిలో జరుగుతున్న గుట్టు బయటపడింది…! కుమార్ సాయి వారిని పశువులు అనేశాడు

బిగ్ బాస్ నాలుగో సీజన్ రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా తయారవుతోంది. కేవలం వారాంతపు రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో కూడా కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇక గత వారం ఎలిమినేట్ అయిన కుమార్ సాయి కి నెమ్మదిగా నెటిజన్ల మద్దతు లభిస్తోంది. అతనిని అందరు టార్గెట్ చేసి బయటకు పంపేశారు అని అంటుంటే…. అతను కూడా ఇంటర్వ్యూలలో అలాగే మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి వెళ్ళిన సాయి ఇంట్లో ఎన్ని రిలేషన్స్ పెట్టుకున్నప్పటికీ సోలో గా గేమ్ ఆడాలని అనుకున్నానని అయితే అందరూ అతన్ని దూరం పెట్టి ఇలా బయటకు పంపించారని కుమార్ అభిప్రాయపడ్డాడు. నన్ను ఎవరు కలుపుకోలేదు…. నిజానికి మనిషులు అయితే కొత్తగా వచ్చిన వారిని దూరం పెట్టి కావాలని టార్గెట్ చేయరు అని అన్నాడు. జంతువులు మాత్రమే అలా చేస్తాయి నా విషయంలో ఇలాగే దూరం పెట్టినట్లు నాకు అనిపించింది అని కుమార్ సాయి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఇక అవసరం కోసం స్నేహం చేసే వ్యక్తిని తాను కాదని…. ఇంటిలో ప్రతి ఒక్కరికి మంచి స్నేహితుడిగా ఉండాలి అనుకున్నానని అయితే చివరికి తన కొంప ముంచిందని అభిప్రాయపడ్డారు. ఇక ఎంత కష్టం ఉన్నా కూడా ఫ్రెండ్ లాగా ఉన్న వారిని ఎలిమినేషన్ లో భాగంగా నామినేట్ చేయాల్సి వస్తోంది అని…. అప్పుడే అసలు రంగు బయటపడుతోంది ఇక కుమార్ మాట్లాడుతూ…. అలా కాకుండా స్నేహితులను కాపాడుకొని మిగతా వారిని టార్గెట్ చేయడమే ప్రస్తుతం ఆ ఇంట్లో జరుగుతున్న తంతు అని అభిప్రాయ పడ్డాడు.