కంటెస్టెంట్ ల గుట్టు సమయానుకూలంగా బయట పెట్టడమే బిగ్బాస్ అసలైన గేమ్. వారి అసలు రంగును ని అతను ఏ క్షణం లో అయినా బహిర్గతం చేయగలడు. కన్ఫెషన్ రూమ్ లోనికి పిలిచి వీడియోలు చూపించి వారి నిజస్వరూపాలను బయట పెట్టేస్తాడు. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాలన్నా…. స్నేహాన్ని విడగొట్టాలన్నా బిగ్బాస్ మించిన గేమర్ మరొకడు లేడు.
నిన్నటి ఎపిసోడ్ లో కొందరికి బిగ్ బాస్ కొన్ని వీడియోలను బిగ్బాస్ చూపించాడు. అఖిల్-సోహెల్ మధ్య మోనాల్ మార్చి చెప్పిన మాటను చూపించి అఖిల్ కళ్ళు తెరిపించాడు. నోయల్-సోహెల్ మాట్లాడుకుంటున్న మాటలను అఖిల్ దగ్గర మోనాల్ మార్చి చెప్పడంతో పెద్ద గొడవ అయింది. మామూలుగా సోహెల్, నోయల్ అంత సీరియస్ టాపిక్ ఏమీ మాట్లాడుకోలేదు. పైపెచ్చు అఖిల్ గురించి చెడుగా అయితే ఏమి చెప్పలేదు. కానీ అసలు టాపిక్ తెలియని మోనాల్…. అఖిల్ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పేసింది.
అలా సోహెల్-అఖిల్ మధ్య బాగా దూరం పెరిగిపోయింది. ఇక పైకి కలిసిపోయినట్లు నటించినా లోపలికి మాత్రం వారికి అలాగే ఉండిపోయింది కూడా. సోహెల్ కూడా మోనాల్ వద్దకు వెళ్లి ఇలా ఒక మాట మరొకచోట చెప్పొద్దని ముద్దుగా చెప్పాడు. ఆమె వినలేదు సరికదా సోహెల్ ను ఇరికించే ప్రయత్నం చేసింది. ఇక నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో అఖిల్ కు మంచిగా కళ్ళు తెరిపించాడు.
మోనాల్ మార్చి చెప్పిన మాటలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించి మోనాల్ మార్చి చెప్పిన వీడియోను చూపించాడు. దీంతో అఖిల్ కు సోహెల్ తప్పేమీ లేదని మోనాల్ విషయాన్ని మార్ఛి చెప్పింది అని తెలిసిపోయింది. ఇకనైనా అఖిల్ మోనాల్ చుట్టూ తిరగడం ఆపేసి తన అసలు గేమ్ బయటకు తీసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటాడా లేదా ఆమెను అతను వీక్నెస్ గా చూపించి బయటికి వెళ్ళిపోతాడా అన్నది చూడాలి.