బిగ్బాస్ ఇంటిలో ఈ సీజన్ లో పోటీ చాలా ఎక్కువ ఉంది. కొందరు ఆడియన్స్ సపోర్ట్ అందుకున్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెటిజన్లు కూడా ట్రోల్ చేసే డోస్ పెంచుతున్నారు. ఇక తాజాగా నోయల్ విషయంలో వైరల్ అయిన న్యూస్ గురించి తెలిసిందే. తన తండ్రి ఉద్యోగం విషయంలో సింపతి కోసం అబద్ధాలు చెప్పాడు అన్న వార్తలపై ఎట్టకేలకు కుటుంబ సభ్యులు స్పందించారు.
ఈ విషయంపై నోయల్ సోదరుడు క్లారిటీ ఇచ్చాడు. వాటిల్లో ఎలాంటి నిజం లేదని తన అన్నయ్య చెప్పిన దానిని కూడా తప్పుగా చూపిస్తున్నట్లు తెలియజేశాడు. ఇక బిగ్ బాస్ షో లో తన చిన్ననాటి ఫొటోలను చూపించగానే తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ అమ్మ ఇంటింటికి తిరిగి పని చేస్తే వంద రూపాయలు వచ్చేవని…. నాన్న రోజు కూలీ అన్నట్లు వివరణ ఇవ్వడంతో ఆ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
అయితే నోయల్ వికీపీడియా పేజీలో తండ్రి డిఫెన్స్ ఆఫీసర్ అన్నట్లు ఉందని కొంతమంది అన్నారు. దీనిపై సోదరుడు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తన అన్నయ్య ఓట్ల కోసం ఇలా మాట్లాడాడు అన్న విషయంలో ఎలాంటి నిజాలు లేవని చెప్పాడు.
వారి నాన్న ఒక ఐరన్ షాప్ లో పని చేయడమే కాకుండా ఆటో కూడా నడిపాడు అని…. అయితే ఈ పనులన్నీ వాళ్ళ నాన్న డిఫెన్స్ లో చేరక ముందు చెప్పినట్లు చెప్పాడు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని వికీపీడియా పేజీ లో ఎవరు చేంజ్ చేశారు అని అన్నాడు. నాన్న ఐరన్ షాప్ నదిపిన ఫోటో కూడా ఉంది అన్నయ్య మోసం చేశాడు అని అనడం లో ఎలాంటి నిజం లేదని తేల్చేశాడు.