ప్రపంచపు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా మొదలైపోయింది. ఇక రేటింగ్స్ పెంచేందుకు అటు నిర్వాహకులు టాస్క్ లో కొత్త ప్లాన్ల తో రెడీ అయిపోతూ ఉంటే మరోవైపు గెలవాలని కంటెస్టెంట్ లు ఇంటిలో చేసే స్టంట్లు హైలైట్ అవుతున్నాయి. ఇక ఎప్పుడైనా ఈ షో లో టైటిల్ గెలవాలంటే టాలెంట్ ఉండి తీరాల్సిందే అని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు సీజన్లలో కూడా ఇది నిరూపితమైంది.
ఇదిలా ఉంటే కొంతమంది నటీమణులు వారి అందాలను ఒలకబోసి క్రేజ్ అందుకోవాలని చూస్తారు. అది మంచిదే అయినా డోస్ పెరిగితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షో లో కూడా ఇదే తరహాలో దోస్త్ పెంచేందుకు ప్రయత్నించి మోనాల్ గజ్జర్ ఇబ్బందుల్లో పడుతుంది. ఈ బిగ్‌బాస్ తెలుగు సీజన్ల లో ఎంతోమంది హాట్ బ్యూటీ లో దర్శనమిచ్చారు. ముమైత్ ఖాన్ నుండి తేజస్వి వరకు గ్లామర్ తో హీట్ ఎక్కించి చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ వీరెవరూ గ్లామర్ తో మిగతా వారిని ఇబ్బంది పెట్టే సందర్భంగా లేదు.
ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బిగ్ బాస్ షో చూస్తారు అని అందరికీ తెలుసు. అయితే ఇక గ్లామర్‌తో టీవీలలో కూడా రెచ్చిపోతే సెన్సార్ రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మోనాల్ కారణంగా బిగ్ బాస్ షో ఇబ్బందులు పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆదివారం మోనాల్ గజ్జర్ వేసుకున్న డ్రెస్ పై ఒక్కసారిగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆమె గ్లామర్ షో దెబ్బకు ఛానల్ మార్చాల్సి వచ్చిందని వినిపిస్తోంది.
నిజాని మోనాల్ కి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి చెప్పే హక్కు ఎవరికీ లేదు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంటిల్లపాది కూర్చుని నాగార్జున వచ్చే ఎపిసోడ్ చూసేందుకు తయారవుతున్న సమయంలో క్లీవేజ్ షో తో ఆమె చేసిన రచ్చ నిజంగానే షాక్ కు గురి చేసింది. అటు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూసే ఈ టీవీ షో లో ఆమె అలా కనిపిస్తే ఛానల్ మార్చకుండా ఎలా ఉంటారు అని నెటిజన్లు వాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మరొకసారి ఈ షో చూసేందుకు కూడా ఇబ్బంది పడతారట. అందుకే పాపం మోనాల్ వ్యవహరిస్తున్న తీరు చాలామందికి తప్పుగా కనెక్ట్ అవుతోంది. ఇక ఈ విషయం మోనాల్ వరకు ఎలా వెళుతుంది…. ఆమె ఎలా తప్పు సరిదిద్దుకుంటుంది అన్న విషయం పై క్లారిటీ రావాలి.