బిగ్ బాస్ 4 : ఇంట్లో లవర్ బాయ్స్ పరువు అంతా తీసేసిన సమంత…! కోడలు పిల్ల మామూలుది కాదే…

ఈ సీజన్ బిగ్ బాస్ మంచి ఫ్లో లో కొనసాగుతోంది. టీఆర్పీ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ రియాల్టీ షో ఈ రోజు దసరా పండుగ నాడు అత్యంత ఎక్కువ ప్రేక్షక ఆదరణ చూరగొంది. ఇక నాలుగో సీజన్ లో నాగార్జున తన సినిమా షూటింగ్ కారణంగా ఈ వారం హోస్టింగ్ చేయలేకపోయాడు. అతని స్థానంలో అక్కినేని కోడలు ఎంటర్ అయింది. కంటెస్టెంట్స్ తో బాగా కలిసిపోయిన ఆమె కొంత మంది పరువు తీసేసింది.

 

ఆ వివరాల్లోకి వెళితే… స్టేజి మీద టీవీ ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ ముందుకు వెళ్లిన సమంత ని చూసి హౌస్ మేట్స్ అంతా షాక్ కు గురి అయ్యారు. సమంత… సమంత అంటూ కేకలు వేశారు. ఇదే సమయంలో ఆమె కంటెస్టెంట్ లు అందరి గురించి చెప్పింది. సరిగ్గా అప్పుడే లవర్ బాయ్స్ కు షాకుల పై షాకులు ఇచ్చేసింది. బిగ్ బాస్ ఇంటిలో అఖిల్, అభిజిత్, అవినాష్ లు లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు చెప్పింది.

ఇక ఇదే రకంగా అఖిల్ ను ప్రస్తావిస్తూ నీ డ్రెస్ బాగుంది ఇది గుజరాతి స్టైలా? అని పంచ్ వేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే మోనాల్ గుజరాతి అమ్మాయి అందుకని ఆ ట్రాక్ పై ఆమె అలా అనేసింది. ఇక అభిజిత్ విషయానికి వస్తే నీకు ఎంత మంది కావాలి అంటూ సెటైర్ వేసింది. అభిజిత్ ముందు మోనాల్ తో లవ్ ట్రాక్ నడిపాడు. తర్వాత అతను హారిక చాలా సన్నిహితంగా ఉన్నాడు. స్వాతి దీక్షిత్ తో కూడా బాగా క్లోజ్ గా ఉండడం చూసి హారిక అతనిపై కోపం పెంచుకుంది. ఈమధ్య ఆరియానా పై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. ఇక చివరిగా అవినాష్ సోఫా ప్రేమ కథ ని ఆటపట్టిస్తూ సమంత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మీ సోఫా ప్రేమ లైన్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి అని చెప్పింది