నాలుగో సీజన్ బిగ్బాస్ ప్రస్తుతానికి చాలా విజయవంతంగా కొనసాగుతోంది. మధ్యమధ్యలో రేటింగ్స్ తగ్గినప్పటికీ వారాంతపు ఎపిసోడ్ లు చాలా రసవత్తరంగా సాగుతుండటంతో తగిన హైప్ క్రియేట్ అవుతూ వస్తోంది. ఇక ఈ దసరా సందర్భంగా నాగార్జున స్థానంలో సమంత రంగంలోకి దిగి హోస్టింగ్ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించింది. ఇక హోస్ట్ గా సమంత విషయంలో ఆశించిన స్థాయిలో నిర్వాహకులకు సంతృప్తి లేదు అన్న వార్తలు బయటకు వచ్చినప్పటికీ రేటింగ్స్ విషయంలో మాత్రం స్టార్ మా కి మంచి లాభాలు వచ్చాయి.
ఇకపోతే రానున్న వారం కూడా సమంత హోస్టింగ్ బాధ్యతలను తన భుజాలపై వేసుకుంటుందా లేదా అనే విషయం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక నాగార్జున వచ్చే వారం కూడా నిర్వాహకులకు కోడలు పిల్ల తోనే కానివ్వమని సలహా ఇచ్చినట్లు సమాచారం. అయితే సమంత మాత్రం మరొక వారం హోస్ట్ బాధ్యతలను నిర్వహించేందుకు ఒప్పుకోవడం లేదట. షో కి కనెక్ట్ కావడం అంత తేలికైన వ్యవహారం కాదని ఒత్తిడితో కూడుకున్న పని అని ఆమె అన్నట్లు అంటున్నారు.
ఇక ఈ విషయమై నాగార్జున కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గతవారం మనం చూసినట్లయితే సమంత ఏ ఒక్క క్యాండిడేట్ తో కూడా గట్టిగా మాట్లాడింది లేదు. గతంలో రమ్యకృష్ణ కూడా నాగార్జున స్థాయిని అందుకోలేకపోయినప్పటికీ తన సహజమైన గంభీరత్వం తో మేనేజ్ చేసింది కానీ సమంత మాత్రం అందరితో నవ్వుతూ పలకరించింది. ఇదంతా పండుగ సమయంలో ఓకే కానీ ఇక మామూలు వారాంతపు ఎపిసోడ్ లో ఫైర్ లేకపోతే ప్రేక్షకులకు మజా. ఉండదు టీవీ కట్టేసి పక్క రోజు ఎలిమినేషన్ ఎవరు అవుతారు అని వెయిట్ చేస్తారు. మరి ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గా వచ్చేవారం ఎవరు వస్తారో వేచి చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!