బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఒక్కసారిగా 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు మొదట్లోనే వరుస వారాల్లో ఇంటిలోకి ప్రవేశించడం అందరికీ భారీగా సర్ ప్రైజ్ చేసింది. అయితే వారందరిలో ఒక్క అవినాష్ తప్పించి మిగతా వారు నిరుత్సాహపరిచారు అని చెప్పాలి. ఇక ఇదే క్రమంలో మరో వైల్డ్ కార్డ్ కి అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇక వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లో లోపలికి వచ్చిన వారు కూడా ఒక్కొక్కరిగా తిరుగుముఖం పడుతున్నారు. ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరు అనే విషయం పై సర్వత్రా చర్చ నెలకొంది. ఇక ఈ హాట్ టాపిక్ లో మొదట బయటకు వచ్చిన పేరు కుమార్ సాయి ది, మొదట్లో కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ తర్వాత టాస్క్ లు వచ్చినప్పుడు ఊహించని విధంగా కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆడియన్స్ కూడా తెగ సంబరపడ్డారు. రేటింగ్ కూడా తారాజువ్వల ఎగిసింది.
ఇక కుమార సాయి కమెడియన్ గా ఇంట్లోకి వచ్చి అతను తన చతురతను ప్రదర్శిస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ ఎప్పుడు చూసినా నిద్రపోతూ చాలా తక్కువ విషయాలకు రియాక్ట్ అయ్యే స్వభావం అతనిది. ప్రతి వారం నామినేట్ అవుతూనే ఉన్నాడు. మిగతా వాళ్ళతో పోలిస్తే పెద్దగా ఏ విషయంలో ఫోకస్ అయింది లేదు. బిగ్ బాస్ కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అసలే లేదు. పైగా ఫిజికల్ టాస్క్ లలో తన ప్రతిభ ను కనబర్చలేదు. అనవసరమైన గొడవలు పడుతూ ఉంటాడనే కామెంట్స్ వస్తుంటాయి. ఇవన్నీ చాలు కుమార్ సాయి ని ఇంటి నుండి బయటకు పంపించడానికి అంటున్నారు ప్రేక్షకులు.