ఈ వారం నో ఎలిమినేషన్? ఈ లాజిక్ చూస్తే మీరు కూడా నిజమే అంటారు

బిగ్ బాస్ నాలుగో సీజన్ మంచి రసవత్తర స్టేజ్ కి చేరుకుంది. ఈవారం అక్కినేని నాగార్జున ప్లేస్ లో అతని కోడలు సమంత హోస్ట్ గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఈవారం ఎలిమినేషన్ లో అభిజిత్, అవినాష్, నోయల్, అరీయానా, దివి, మోనాల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అన్న విషయంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. అందరూ ఈ వారం మొన ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకుంటున్నారు.

 

అయితే ఇప్పుడు ఒక్కసారిగా వచ్చిన వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్ ఉండబోవట్లేదు అని బయటకు టాక్ వచ్చింది. అదీ కాకుండా ఈ వారం సభ్యులు జంటగా విడిపోయి ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. ఇక సమంతా హోస్ట్ గా వస్తున్న ఈ వారాంతంలో ఎలాంటి ఎలిమినేషన్ ఉండకపోవడం లాజికల్ అని అంటున్నారు. దీని వెనుక ఒక సెంటిమెంట్ కూడా ఉంది.

గత సీజన్లో నాగార్జున ఇలాగే ఒక వారం అందుబాటులో లేడు. అతని ప్లేస్ లో రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించింది. అప్పుడు కూడా రమ్యకృష్ణ వచ్చిన వారం ఎలాంటి ఎలిమినేషన్ ప్రక్రియ చోటు చేసుకోలేదు. ఇక ఎవరైనా ఎలిమినేట్ చేసిన తర్వాత బయటకు తీసుకుని వచ్చి ఆడించేందుకు కూడా మొదటి నుండి అందరినీ దగ్గరగా గమనిస్తున్న నాగార్జున అయితే బాగుంటుంది అని నిర్వాహకులు భావించి ఉంటారని అంటున్నారు.

క్రితం సారి తన పుట్టిన రోజు వేడుకలను నిమిత్తం గైర్హాజరైన నాగార్జున ఈసారి తన సినిమా షూటింగ్ కోసం అందుబాటులో లేకుండా ఉన్నాడు. అతని స్థానాన్ని సమంత ఎంతవరకు భర్తీ చేస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే ఈవారం ఎలిమినేషన్ లేకపోవడం ప్రేక్షకులకు ఒకింత నిరాశ కలిగించే విషయమే.