బిగ్ బాస్ 4 : నోయల్ ఆరోగ్యం కి అసలేమైంది..? ఇంతకీ వెనకున్న ఆ రహస్యం ఏమిటి….

బిగ్బాస్ ఇంటిలో పేరున్న అతి కొద్దిమంది సెలబ్రిటీలలో నోయెల్ సీన్ టాప్ అనే చెప్పాలి. తన అద్భుతమైన టాలెంట్ తో స్క్రీన్ పైన మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నోయల్ సింగర్ గా కూడా అందర్నీ ఆకట్టుకుంటాడు. తనలోనే ఉన్న విద్యలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్ నోయల్న ప్రస్తుతానికి ఇండస్ట్రీ లో కొద్దిగా బిజీగా మారిపోయాడు. ఇక ఇటీవలే బిగ్బాస్ షో లోకి అడుగుపెట్టిన నోయల్ అర్ధాంతరంగా బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

 

ఆరోగ్యం బాగోలేక నోయల్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని బిగ్బాస్ ప్రకటించాడు. అయితే అతని ఆరోగ్యంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతని గురించి ఒక వార్త బయటకు వచ్చింది. టైటిల్ ఫేవరెట్ లలో ఒకడైన నోయల్ నిదానంగా ఇంటిలో చాలా సైలెంట్ అయిపోయాడు .మొదటి యాక్టివ్ గా ఉన్న అతను తర్వాత మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ మైండ్ చదివేసి తెలివైన ఆట ఆడుతున్నాడు అని అందరూ అంటున్నారు. అలాగే అందరితో స్నేహంగా ఉంటూ అసలు నామినేషన్ గొడవ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు.

ఇక ఆరోగ్య సమస్యల నుండి ఇంటి నుండి బయటకు వెళ్ళిన అతనికి కొద్ది రోజులు ముందు కాళ్ళ నొప్పి తో బాగా బాధ పడ్డాడు. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అసలు కెమెరా అతని వైపు తిప్పనేలేదు. చాలా సేపు రెస్ట్ తీసుకుంటూ కనిపించాడు. ఇక వైద్యుల సూచన మేరకు అతనిని ఇంటి నుండి బయటకు పంపేశారు. ఇక చాలా మందికి… నోయల్ ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత అతడి ఆరోగ్యం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఎవరికి నచ్చినట్టు వారు అతనికి ఆ వ్యాధి వచ్చింది… ఈ వ్యాధి వచ్చింది అని చెబుతున్నారు. ప్రస్తుతానికి నోయల్ కి ప్రాణహాని ఏమీ లేదట కానీ బిగ్బాస్ నిర్వాహకులు అతనికి ఏమీ బాగోలేదో చెబితే బాగుంటుందని… లేదా ప్రేక్షకులకు మరిన్ని అనుమానాలు వస్తాయని ఇంటి నుండి వెళ్ళిపోయేలాగా అతనికి ఏమి వచ్చింది అన్న ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.