Biggest flop movie: 2021లో ఈ దేశంలోనే అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచిన చిత్రం ఏదో తెలుసా.. `83`. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అడుగడునా అనేక అవమానాలు ఎదుర్కొన్న టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఎలా చేరింది..? అప్పటికే రెండు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న వెస్టండీస్‌పై ఎలాంటి అంచనాలు లేని భారత్ గెలిచి వరల్డ్ కప్ ఎలా కొల్లగొట్టింది..? అన్న ఆంశాల నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ కపిల్ ప్రతిభను హైలైట్ చేస్తూ తీసిన చిత్రమిది.
కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిల్ దేవ్ గా రణ్వీర్ సింగ్, ఆయనకు భార్య దీపికా పడుకోణె నటించింది. పంకజ్ త్రిపాఠి, జీవా, హార్దీ సంధు, తాహీర్ భాసిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటం ఫిల్మ్స్, విబ్రి మీడియా, కెపె ప్రొడక్షన్స్, నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్లపై రూ.125 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.
ఇక ఎన్నో అంచనాల నడుమ గత ఏడాది డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్డా పడింది. సాధారణ ప్రేక్షకులనే కాదు చివరకు క్రికెట్ ప్రియులనూ ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. కథనం సరిగ్గా లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాలేదు. దీంతో ఈ చిత్రం రూ.60 కోట్ల షేర్‌ను మాత్రమే వసూల్ చేసి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. అంతేకాదు, 2021లో ఈ దేశంలోనే అతి పెద్ద ఫ్లాప్ చిత్రంగా 83 ముద్ర వేయించుకుంది. అయితే దర్శకుడు మాత్రం 83 పరాజయాన్ని కరోనా వైరస్ మీదకు తోసేసారు. కరోనా వల్లే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ను రాబట్టలేకపోయిందని అంటున్నారు.