Bollywood: భారతీయ చలన చిత్ర రంగంలో టాలీవుడ్ టైం ప్రస్తుతం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే అక్కడ స్టార్ హీరోల సినిమాలను తలదన్నేలా తెలుగు సినిమాలు అక్కడ భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. “బాహుబలి 2” మొదలుకుని అనేక తెలుగు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ హీరోలు సైతం… తెలుగు సినిమాలను రీమేక్ చేసుకుని హిట్ కొట్టి… మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు. పైగా ఇటీవలే “పుష్ప”, “RRR” సినిమాలకి రికార్డు స్థాయి కలెక్షన్ లు రావడం టాలీవుడ్ పేరు బాలీవుడ్ లో మారుమ్రోగుతోంది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “RRR” ఏకంగా 1000₹ కోట్లకు పైగా సాధించటం జరిగింది. దీంతో తెలుగు డైరెక్టర్లకు ఇంకా చాలామంది నటీనటులకు బాలీవుడ్ లో భారీ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్, గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగా.. మరికొంత మంది తెలుగు దర్శకులు అక్కడ హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థల నుండి తెలుగులో ఇద్దరు టాప్ కమెడియన్ లకు అవకాశాలు ఇవ్వటానికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ఇటీవల ఓ వార్త వైరల్ అవుతుంది.
ఆ ఇద్దరు కమెడియన్ లు మరెవరో కాదు వెన్నెల కిషోర్, సునీల్. ఇద్దరికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థల నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయి అని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీనీ చిన్న చూపు చూసిన బాలీవుడ్ ఇప్పుడు.. టాలీవుడ్ దర్శకులు మొదలుకొని కమెడియన్ ల వెంటపడటం చూస్తే తెలుగు సినిమా స్థాయి పెరిగింది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…