టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ లకు ఏమాత్రం కొదవ ఉండదు. ఆల్రెడీ ఇండస్ట్రీలో మరియు నందమూరి అభిమానుల్లో బాలకృష్ణని ఓ రేంజ్ లో చూపించాలంటే బోయపాటి యే కరెక్ట్ అని చాలామంది అంటుంటారు. అలాంటప్పుడు బాలయ్యతో చేస్తున్న మూడో సినిమా విషయంలో యాక్షన్ సన్నివేశాలకు తగిన విధంగా బాలయ్య పవర్ ఫుల్ క్యారెక్టర్ కి సరిపోయే విధంగా విలనిజం చూపించడానికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సరైన హీరోని బోయపాటి రంగంలోకి దింపుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
మామూలుగానే బోయపాటి దర్శకత్వంలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ నేపథ్యంలో మూడో సినిమా బాలకృష్ణతో కచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధించాలని..ఈ సినిమాలో ఇద్దరు విలన్లను సెట్ చేశారట. మొదటి విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తుండగా…. రెండో విలన్ పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ని తీసుకోవాలని బోయపాటి డిసైడ్ అయినట్లు సమాచారం. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సంజయ్ దత్ ని బోయపాటి చూపించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే సంజయ్ దత్ తో బోయపాటి మాట్లాడినట్లు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో సంజయ్ జాయిన్ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.