Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ స్టార్ గా కనిపిస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క “కేజిఎఫ్” రెండు భాగాలతో తిరుగులేని డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ పేరు సంపాదించడం జరిగింది.
“కేజిఎఫ్” రెండో భాగం ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న “సలార్” పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఒకపక్క ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే మరోపక్క మారుతీ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రభాస్ రెడీ అయ్యాడు. ఇటువంటి తరుణంలో ప్రభాస్ కి ప్రతి నాయకుడిగా విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నీ తీసుకోవడానికి మారుతీ రెడీ అయినట్లు సమాచారం. “KGF 2” లో సంజయ్ దత్ విలన్ పాత్రలో అద్భుతంగా మెప్పించాడు. దీంతో సంజయ్ దత్ నీ తీసుకోవటానికి మారుతీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ కానుందట. భారీ ఎత్తున సెట్స్ కూడా వేసిన్నట్లు ఫిలిం నగర్ టాక్. వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా విడుదల చేసే రీతిలో షూటింగ్ షెడ్యూల్స్ మారుతీ రెడీ చేస్తున్నారు. రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో మారుతీ సినిమాకి సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!