Samantha: స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెల నుండి ఈ వ్యాధికి సంబంధించి చికిత్స నిమిత్తం మంచానికే సమంత పరిమితమైంది. దాదాపు రెండు నెలలపాటు కెమెరాల ముందుకు బయటికి ఎక్కడా కూడా రాలేదు. అయితే నిన్న తన కొత్త సినిమా “శాకుంతలం” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సమంత పాల్గొనడం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఫిబ్రవరి 17వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చాలా కాలం తర్వాత కెమెరాల ముందుకు వచ్చిన సమంత… ఈ కార్యక్రమంలో చాలా ఎమోషనల్ అయ్యింది. బలం లేకపోయినా గాని ప్రేక్షకుల కోసం ఓపిక తెచ్చుకుని మరీ వచ్చినట్లు తెలిపింది.

దర్శకుడు గుణశేఖర్ స్పీచ్ కి సమంత చాలా ఎమోషనల్ అయింది. అందరి ముందు కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సమంత గ్లో తగ్గిపోయింది.. వేదికపై చాలా నీరసంగా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ స్పందించాడు. “మీరు దేనికి బాధపడక్కర్లేదు. కేవలం క్లిక్ బైట్స్ కోసమే ఆలోచిస్తారు. మీకు గ్లో కావాలంటే… ఇంస్టాగ్రామ్ లో ఫిల్టర్స్ ఉన్నాయి. ఒక్కసారి సమంతను కలవండి.

అప్పుడు తన గ్లో ఏంటో మీకే అర్థమవుతుంది”..అని ఘాటు రిప్లై ఇవ్వడం జరిగింది. వరుణ్ దావన్ ఇచ్చిన ఈ కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలావుండగా బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ తో కలిసీ సమంత హర్రర్ నేపథ్యంలో సినిమా చేయనున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. గత ఏడాది ఈ వార్త వైరల్ అయింది. అనంతరం సమంత అనారోగ్యానికి గురి కావడం జరిగింది. అయితే మొత్తం కోలుకున్న తర్వాత సమంత ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం.