NewsOrbit
Entertainment News సినిమా

Alia Bhatt: రాజమౌళి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్..!!

Share

Alia Bhatt: భారతీయ చలనచిత్ర రంగంలో ఉన్న దర్శకులలో ఎస్.ఎస్ రాజమౌళి టాప్ మోస్ట్ దర్శకుడు అని అందరికీ తెలుసు. బాహుబలి, RRR సినిమాలతో ప్రపంచంలోనే మంచి గుర్తింపు పొందిన దర్శకుడిగా రాణించటం జరిగింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో RRR అత్యధికమైన అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సినిమాగా రికార్డుతో పాటు ఆస్కార్ అవార్డు కూడా గెలవడం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా రాజమౌళితో సినిమాలు చేయడానికి ఎలా అయితే నిర్మాతలు హీరోలు రెడీ అవుతున్నారో ప్రపంచవ్యాప్తంగా.. కూడా అదే పరిస్థితి నెలకొంది. హాలీవుడ్ నిర్మాతలు జక్కన్నతో సినిమా చేయడానికి మంచి ఉత్సాహం మీద ఉన్నారట. ఆల్రెడీ ప్రపంచ గ్రేడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళితో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేశారు.

Bollywood heroine Alia Bhatt made interesting comments on Rajamouli

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ అలియా భట్ రాజమౌళి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక కథను అద్భుతంగా తెరకెక్కించగలరని ఇటీవల ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. అంతేకాదు ఆయన నుంచి ఎన్నో కొత్త అంశాలు నేర్చుకోవచ్చని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో “RRR” సినిమా చేస్తున్న సమయంలో నటనపరంగా సలహా అడిగితే.. ఎటువంటి పాత్ర అయినా ప్రేమతో చేయాలని రాజమౌళి సార్ చెప్పారు. అప్పుడు చేసిన సినిమా ఆడిన ఆడకపోయినా మన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోవాలని చెప్పుకొచ్చినట్లు ఆలియా భట్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. “RRR” లో రామ్ చరణ్ కి జోడిగా సీత పాత్రలో నటించింది. సినిమాలో ఆలియా భట్ పాత్రకి అంత డిమాండ్ లేకపోయినా గాని.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడం జరిగింది.

Bollywood heroine Alia Bhatt made interesting comments on Rajamouli

ఇక ఇదే సమయంలో ఇటీవల టైం మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది ప్రభావశీలుర జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకోవడంతో ఆలియా భట్ ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. కాగా ప్రస్తుతం రాజమౌళి..తర్వాత సినిమా మహేష్ బాబు ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా తేరాకెక్కుతోంది. హాలీవుడ్ లో మించిన యాక్షన్స్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ శాతం షూటింగ్ ఆఫ్రికా అడవులలో తీయనున్నట్లు టాక్ నడుస్తుంది. మహేష్ బాబు ని ఎవరు చూపించని రేంజ్ లో… జక్కన్న చూపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా అయినా వెంటనే రాజమౌళి ప్రాజెక్టు మహేష్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.


Share

Related posts

Avatar 2 Trailer: జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి విజువల్ వండర్ “అవతార్ 2” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

సూపర్ స్టార్స్ ఇద్దరూ తొలి అడుగేశారు.. మిగిలిన హీరోలేం చేస్తారో..?

Muraliak

వెంకటేష్ కు ‘నో’ చెప్పింది…. చిరు ని వెయిట్ చేస్తోంది..! ఈ తమిళ బ్యూటీ రేంజ్ వేరే…?

siddhu