స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జతగా వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ హీరోయిన్గా నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. నిజానికి దిశాపటానీ తన కెరీర్ను తెలుగులో`లోఫర్`నుండే స్టార్ట్ చేసింది. తర్వాత బాలీవుడ్లోకి అడుగుపెట్టి, అక్కడ ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే ఇప్పుడు బన్నీ, వేణుశ్రీరామ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే `ఐకాన్ కనపడుట లేదు` చిత్రంలో హీరోయిన్గా నటించనుందనే వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుందని మరికొందరు అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ చిత్రాన్ని దిల్రాజు నిర్మించబోతున్నారు.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!