NewsOrbit
Entertainment News సినిమా

SSMB 28: త్రివిక్రమ్.. మహేష్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్..?

Share

SSMB 28: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాక అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతోపాటు సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే కాలికి గాయం కావడంతో.. రెండో షెడ్యూల్ సంక్రాంతికి మొదలు కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో పూజ హెగ్డేతో పాటు మరో హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నట్లు. మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కాకా ఇప్పుడు ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bollywood heroine in Trivikram Mahesh movie

విషయంలోకి వెళ్తే ఈ సినిమా అని పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో హిందీ వర్షన్ లో శ్రీ లీల పాత్రలో భూమి పెడ్నేకర్ అనే బాలీవుడ్ హీరోయిన్ నటించిన వార్తలు వస్తున్నాయి. 2017లో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ అవ్వడం జరిగింది. అప్పటినుండి రకరకాల పాత్రలు చేస్తూ కెరియర్ లో విజయవంతంగా దూసుకుపోతుంది. అయితే మహేష్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ హవా నడుస్తోంది. దీంతో చాలామంది బాలీవుడ్ తారలు దక్షిణాది సినిమా రంగంలో ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ లు దీపికా పదుకొనే, అలియా భట్, అనన్య పాండే వంటి వారు ఆల్ రెడీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Bollywood heroine in Trivikram Mahesh movie

ఈ తరహాలోనే భూమి పెడ్నేకర్.. మహేష్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండు సినిమాలలో మహేష్ లో ఉన్న టాలెంట్ నీ అద్భుతంగా చూపించడం జరిగింది. “అతడు”లో సైలెంట్ అయితే.. “ఖలేజా” లో పూర్తిగా కామెడీ పాత్రలో మహేష్ కనిపించాడు. మరి ఇప్పుడు చేయబోతున్న మూడో సినిమాలో తమ అభిమాన హీరోని త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా అభిమానులు ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభించిన సమయంలో ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆగస్టు నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Share

Related posts

పాపం.. ఆ మానసిక వేదన వల్లే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లడం మానేశారట!

Teja

Allu arjun : అల్లు అర్జున్ వెనక స్టార్ డైరెక్టర్..పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ సెట్ చేస్తారా..?

GRK

బ్రేకింగ్ : డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం..! ఇదిగో ఫోటో

arun kanna