Pawan Kalyan: డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) “హరిహర వీరమల్లు”(Hari Hara Veeramallu) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొగలుల సామ్రాజ్యం కాలం నాటి నేపథ్యంలో.. ఒక చరిత్రత్మకమైన సంఘటన తీసుకుని తెరక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ చాలా డిఫరెంట్ లుక్ లో ఈ సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో పోరాట సన్నివేశాలు సైతం చాలా హైలెట్ గా నిలుస్తాయని..టాక్. పోరాట సన్నివేశాల కోసం పవన్ కొన్ని ప్రాచీన కాలంనాటి విద్యలు కూడా నేర్చుకున్నట్లు.. “హరిహర వీరమల్లు” ఫైట్స్ సీక్వెన్స్ ప్రొఫెషనల్ ఫైటర్ లతో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ నర్గిస్ ఫక్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఇంకా కెరియర్ గురించి కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో “రాక్ స్టార్”(Rock Star) సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నర్గిస్ ఫక్రి(Nargis Fakhri).. తొలి సినిమాతోనే ఆకట్టుకోవటం జరిగింది. నాలుగు పదుల వయసు కలిగిన ఈ ముద్దుగుమ్మ… పోటి విషయంలో ఇతర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ “హరిహర వీరమల్లు”తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఈ సందర్భంగా పవన్… సినిమా గురించి మాట్లాడుతూ…. “హరిహర వీరమల్లులో”.. “రోషనార” పాత్ర చేస్తున్నట్లు తెలిపింది. “రోషనార” పాత్ర వినినప్పుడు చాలా కొత్తగా అందంగా ఉంది. క్రిష్ దర్శకత్వంలో నటించే రోజు కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నాను అంటూ నర్గిస్ ఫక్రి… తన తాజా లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇదిలా ఉంటే అసలు ఈ పాత్ర జాక్విలన్ ఫెర్నాండేజ్ చేయాల్సిన పాత్ర అని.. ఆమె ఈడి కేసుల్లో ఇరుక్కోవటంతో…నర్గిస్ ఫక్రినీ క్రిష్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.