సినిమా

Bollywood: బాలీవుడ్ నీ టెన్షన్ పెడుతున్న సౌత్ లో ఆ నలుగురు ..??

Share

Bollywood: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల గురించి ప్రపంచ దేశాలు  చర్చించుకునేవి. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద ఇండస్ట్రీ హాలీవుడ్ తర్వాత రెండో స్థానంలో బాలీవుడ్. ఇదిలా ఉంటె  దేశంలో బాలీవుడ్.. మిగతా సినిమా ఇండస్ట్రీలని చాలా చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా దక్షిణాది సినిమా రంగాన్ని చాలా చులకనగా చూసేది. పనిగట్టుకుని బాలీవుడ్ మీడియా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హీరో లను మరియు సినిమాలకు సంబంధించి.. తక్కువగా చూపించేది. ఇదే విషయాన్ని ఒకానొక సమయంలో తెలుగు సినిమా వజ్రోత్సవం కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తెలియజేశారు. రామారావు, నాగేశ్వరరావు ఇంకా సౌత్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులకు.. కనీస గుర్తింపు నార్త్ లో లేదని అప్పట్లో సంచలన కామెంట్స్ చేశారు.

Shankar And Prashanth Neel Sailing On The Same Boat

ఒకప్పుడు పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్.. దక్షిణాది సినిమాలకు షేక్ అయిపోతుంది. “బాహుబలి 2” దెబ్బకి బాలీవుడ్ మొదలుకొని సౌత్ వరకు అన్ని రికార్డులు రాజమౌళి బ్రేక్ చేయడం తెలిసిందే. అప్పటినుండి బాలీవుడ్ బాక్సాఫీస్ నీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ సినిమాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఈ పరిణామంతో బాలీవుడ్ మీడియా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు గౌరవం ఇచ్చే పరిస్థితికి చేరుకుంది. “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్”, “పుష్ప”, “కేజిఎఫ్2” దక్షిణాది సినిమాలు తిరుగులేని విజయం సాధించడంతో.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే.Sukumar Blown Away By 'RRR'; Hails Rajamouli - Movie News

ఈ పరిణామంతో ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నలుగురు దర్శకుల సినిమాలకు బాలీవుడ్ బెదిరి పోతున్నట్లు సరికొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్ ల లిస్టు చూస్తే రాజమౌళి, ప్రశాంత్ నీల్, శంకర్, సుకుమార్. దక్షిణాది సినిమా రంగానికి చెందిన ఈ నలుగురు దర్శకులు బాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారారు. వీళ్ల దర్శకత్వ ప్రతిభ గురించి బాలీవుడ్ మీడియా కథలు కథలుగా వార్తలు ప్రసారం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ నలుగురు దర్శకుల సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో హిందీ సినిమా రిలీజ్ చేయకుండా ఉంటే బెటర్ అనే పరిస్థితికి బాలీవుడ్ వచ్చినట్లు డిస్కషన్స్ బయటకు వస్తున్నాయి.


Share

Related posts

వాళ్లిద్ద‌రే ప్రియ‌ద‌ర్శికి స్ఫూర్తి

Siva Prasad

Keerthy Suresh: రియ‌ల్‌గానూ దొంగ‌త‌నం చేశా.. కీర్తి ఆన్సర్‌తో షాకైపోయిన‌ మ‌హేశ్‌!

kavya N

Allu Arjun: బ‌న్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. అది నిజం కాద‌ట‌?!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar