28.2 C
Hyderabad
February 4, 2023
NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Pathaan Review: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ “పఠాన్” సినిమా రివ్యూ..!!

Share

Pathaan Review: దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్..గా తెరకెక్కిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ “పఠాన్” రివ్యూ మరియు రేటింగ్ విశేషాలు.

సినిమా పేరు: పఠాన్
దర్శకుడు: సిద్ధార్థ ఆనంద్
నటీనటులు: జాన్ అబ్రహం, దీపికా పదుకొనే, సీనియర్ నటి డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా తదితరులు.
నిర్మాతలు: ఆదిత్య చోప్రా
సంగీతం: విశాల్ శేఖర్
విడుదల తేదీ: 25-01-2023
Bollywood King Khan Sharukh Khan Pathaan movie Review
Bollywood Pathaan movie Review
పరిచయం:

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలు పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. కానీ గత పది సంవత్సరాలు నుండి సరైన హిట్టు కొట్టలేక సతమతమవుతున్నాడు. షారుక్ చివరి సినిమా “జీరో” 2018 వ సంవత్సరంలో రిలీజ్ అయింది. కాగా దాదాపు నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇప్పుడు “పఠాన్” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. షారుక్ కీ హిట్ పడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జనవరి 25 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలలో నేడు 7700 స్క్రీన్ లలో రికార్డు స్థాయిలో విడుదల కావడం జరిగింది. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా కూడా ఈ రీతిలో విడుదల కాలేదు. ఇండియాలో 5200… ఓవర్ సీస్ లో 2500 స్క్రీన్ లలో రిలీజ్ కావడం జరిగింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలయ్యింది. బుకింగ్స్ పరంగా ఓ రేంజ్ లో బిజినెస్ జరిగింది. మరి “పఠాన్” సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Bollywood King Khan Sharukh Khan Pathaan movie Review
Sharukh Khan Pathaan movie Review
స్టోరీ:

చాలా సింపుల్ స్టోరీతో “పఠాన్” తెరకెక్కటం జరిగింది. ఇండియాని దెబ్బతీయాలని కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే డేంజరస్ టెర్రర్ గ్రూప్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని… డేంజరస్ సింథటిక్ వైరస్ రిలీజ్ చేసి భారతీయులను చంపే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుద్ది. దీంతో ఈ వరల్డ్ డేంజరస్ టెర్రర్ గ్రూప్ చేపట్టిన ఆపరేషన్ నిరోధించడానికి భారత ప్రభుత్వం అండర్ కవర్ కాప్ పఠాన్(షారుక్) నీ రంగంలోకీ దీంపుద్ది. కాగా ఈ పఠాన్..  మాజీ నేరస్థుడు సాయంతో కలిసి బలమైన ప్రత్యర్థి టెర్రరిస్ట్ గ్రూపు లీడర్ జాన్ అబ్రహం వేసే ప్లాన్స్ ఎలా ఎదుర్కొన్నారు..? దేశాన్ని ఏ విధంగా కాపాడాడు అనేది స్టోరీ.

Bollywood King Khan Sharukh Khan Pathaan movie Review
Bollywood King Khan Sharukh Khan
విశ్లేషణ:

ఈ సినిమా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ ట్రాక్ రికార్డు చూస్తే చాలా వరకు యాక్షన్ ఎంటర్టైనర్ లు గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు షారుక్ నటించిన “పఠాన్” కూడా అదే పంథాలో రూపొందింది. షారుక్ తన నటన విశ్వరూపం చూపించాడు. కొన్ని సన్నివేశాలలో జేమ్స్ బాండ్ తరహాలో షారుక్ హావభావాలకీ ఆడియన్స్ త్రిల్ అవుతారు. ఫుల్ లెన్త్ యాక్సిడెంట్ ఎంటర్టైనర్ గా “పఠాన్” ఆడియన్స్ నీ బాగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ రిలీజ్ సమయంలోనే స్టోరీ చెప్పేయడంతో సినిమాలో టేకింగ్.. నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫస్టాఫ్ లో ప్రేక్షకులు ఊహించని రీతిలో థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో మైమరీ పీస్తాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లేతో ఊహించిన ట్విస్టులతో .. కథని ముందుకు నడిపించడం సినిమాకి చాలా హైలైట్. విలన్ పాత్రలో జాన్ అబ్రహం ఇంకా హీరోయిన్ పాత్రలో దీపికా పదుకొనే తగిన న్యాయం చేశారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు దీపికా పదుకొనేకి సంబంధించిన ఒక పాట పెద్ద వివాదాస్పదం కావడం తెలిసిందే. కానీ సినిమాలో మాత్రం ఎక్కడా కూడా వల్గారిటీ లేదు. దీపిక నటనతో పాటు పొదుపు అయిన గ్లామర్ తో బాగా ఆకట్టుకోవడం జరిగింది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ట్విస్ట్ లు ఆడియన్స్ నీ త్రీల్ కీ గురి చేస్తాయి. హైవోల్టేజ్ యాక్షన్స్ సన్నివేశాలతో, భారీ చేజింగ్స్, లొకేషన్స్ సినిమా చూసే ప్రేక్షకుడిని కట్టిపడేస్తయి. రష్యా వంటి దేశాలలో హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్రాలు చిత్రీకరించిన ప్రాంతాలలో “పఠాన్” షూటింగ్ జరుపుకుంది. దర్శకుడిగా సిద్ధార్థ ఆనంద్ పనితనం 100/100 మార్కులు వేసేయొచ్చు. ఎక్కడ కూడా అనవసర సన్నివేశాలు లేకుండా ప్రేక్షకులకు ఏమేరా ఎంటర్టైన్మెంట్ మరియు యాక్షన్ అందించాలో…జాగ్రత్తపడ్డాడు. షారుక్ ని…. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ రీతిగా చూపించాడు.

Bollywood King Khan Sharukh Khan Pathaan movie Review
Pathaan Movie Review
ప్లస్ పాయింట్స్:

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
షారుక్ నటన.
యాక్షన్ ఎపిసోడ్స్.
లోకేషన్ లు.

మైనస్ పాయింట్స్:

కొన్నిచోట్ల సాగదీత సన్నివేశాలు.

 

ఓవరాల్: “పఠాన్”తో షారుక్ కం బ్యాక్ అని చెప్పవచ్చు.
రేటింగ్: 3.5/5

Share

Related posts

తమిళ క్రేజీ హీరో తో త్రివిక్రమ్ సినిమా .. ఇది సౌత్ ఇండియా కి టాప్ మోస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ !!

sekhar

స‌ముద్రతీరాన ఆ పని చేస్తున్న పూజా హెగ్దే.. ఫోటోలు వైరల్!

Teja

Naa Ventapaduthunna Chinnadevademma: “నా వెంటపడుతున్న చిన్నాడేవడెమ్మా” ఫస్ట్ లుక్..

bharani jella