బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92) ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలం నుండి ఆయన ముంబైలోని హాస్పిటల్లో ఊపిరితిత్తుల సమస్యతో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఈయన కభీ కభీ, ఉమ్రావో జాన్, రజియా సుల్తాన్, బజార్ వంటి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఉమ్రావో జాన్ చిత్రానికి ఈయనకు నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే 2011లో సంగీత రంగంలో ఈయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
previous post
next post