Prabhas: అంకుల్ లాగా ఉన్నావ్ అంటూ ప్రభాస్ ను ట్రోల్ చేసిన బాలీవుడ్ వెబ్ సైట్.. దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్..!

Share

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నారు. అయితే ఇటీవల ఆయన ముంబయిలో డాన్స్ రిహార్సల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు అతని ఫొటోలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రభాస్ ఫొటో పై కొందరు బాలీవుడ్ నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ చాలా లావెక్కారని ట్రోల్ చేయడం ప్రారంభించారు. మేకప్ లేకపోతే ప్రభాస్ ఇలా ఉంటారని మరికొందరు నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేశారు. మేకప్ లేకుండా చూస్తే వయసుపైబడిన అంకుల్ లాగా.. ఒక పాల అమ్మే అంకుల్ లాగా ప్రభాస్ కనిపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Breaking: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం నుండి కొత్త ట్రాఫిక్ రూల్..!!

BREAKING : బిగ్ బాస్ 5 ఆరంభ తేదీని ప్రకటించిన స్టార్ మా.. ఎప్పుడంటే..?
లావెక్కినందుకు ప్రభాస్ ను వడ పావ్ తో పోలుస్తున్నారు. దీంతో తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. అయితే ఈ కామెంట్స్ ని హైలెట్ చేస్తూ ఒక బాలీవుడ్ డిజిటల్ న్యూస్ వెబ్సైట్ ఒక ఆర్టికల్ రాసింది. దీంతో ఆ వెబ్ సైట్ ని కూడా అభిమానులు కడిగిపారేస్తున్నారు.

GHMC: టూలెట్ బోర్డు పెడితే ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ అధికారులు..వామ్మో అనుకున్న ఇంటి ఓనర్లు..!

అయితే ఈ ఫొటోలలో ప్రభాస్ కాస్త బొద్దుగా.. డిఫరెంట్ గా కనిపించారు. నిజానికి ఐశ్వర్య రాయ్ అయినా సరే వెండితెరపై ఒక విధంగా.. బయట ఒక విధంగా కనిపిస్తుంటారు. కొంచెం అందం తగ్గినంత మాత్రాన ఈ స్థాయిలో విమర్శించడం నిజంగా బాధాకరం. ఒక సౌత్ ఇండియన్ స్టార్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక బాలీవుడ్ ఫ్యాన్స్ ఇలా కామెంట్స్ చేస్తున్నారని ప్రభాస్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతుండగా.. ఇందులో ప్రభాస్ సరసన కృతిసనన్ కనిపించనున్నారు. త్వరలోనే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


Share

Related posts

వైసీపీకి మొదటి ప్రమాద హెచ్చరిక..! కులం పెత్తనంపై అసమ్మతి..!!

Srinivas Manem

జగన్ చక్ర వ్యూహం అమలు..900 కోట్ల భారీ స్కాం పట్టుకున్నాడు!

Yandamuri

నేషనల్ మీడియాలో జగన్ కెసిఆర్ గురించి ప్రత్యేక బులిటెన్ !

Yandamuri