NewsOrbit
సినిమా

Jersey: బన్నీతో కలిసి సినిమా, డాన్స్ చేయాలని ఉందంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..!!

Share

Jersey: “పుష్ప”తో ఐకాన్ స్టార్ బన్నీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకోవడంతో… బన్నీ క్రేజ్ డబల్.. త్రిబుల్ అయ్యింది. “పుష్ప” రాకముందు తెలుగులో మరియు మలయాళంలో సౌత్ లో కొన్ని ఇండస్ట్రీలలో బన్నీకి సపరేట్ మార్కెట్ ఉండేది. కాని “పుష్ప” రాకతో దేశవ్యాప్తంగా…ప్రపంచవ్యాప్తంగా సరికొత్త మార్కెట్ క్రియేట్ అయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా “పుష్ప” అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఐకాన్ స్టార్ బన్నీతో డాన్స్ మరియు సినిమా చేయాలని తన తాజా సినిమా జెర్సీ ట్రైలర్ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Balaji Telefilms, Pen Marudhar acquire India theatrical rights for Shahid Kapoor's 'Jersey' | Hindi Movie News - Times of India

“పుష్ప” లో అల్లు అర్జున్ వేసిన శ్రీవల్లి పాటకి డాన్స్… మరియు గడ్డంపై తగ్గేదేలా… అనే డైలాగ్ చాలా ఇష్టమని.. కుదిరితే బన్నీతో సినిమా చేస్తానని…షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే “జెర్సీ” సినిమా నాని తెలుగు లో హీరోగా చేయటం తెలిసిందే. ఈ సినిమాని  డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు. 2019 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టింది. హిందీలో ఈ సినిమాని ఇప్పుడు షాహిద్ కపూర్ చేశాడు. అక్కడ కూడా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించడం విశేషం.

After Disha Patani, Shahid Kapoor heaps praise on Allu Arjun's dancing skills | Hindi Movie News - Times of India

కాగా ఈ సినిమా ఈ నెల 14వ తారీకు రిలీజ్ అవ్వుతున్న తరుణంలో హిందీ “జెర్సీ” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో … హీరో షాహిద్ కపూర్ “పుష్ప” సినిమా ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. షాహిద్ కపూర్ గతంలో వరస ఫ్లాపు లలో  ఉన్నాడు. ఈ క్రమంలో తెలుగులో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయినా “అర్జున్ రెడ్డి” నీ హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగులో జెర్సీ ని హిందీలో అదే పేరుతో రీమేక్ చేయడం జరిగింది. మరి జెర్సీ షాహిద్ కపూర్ కి హిట్ ఇస్తుందో.. ఫ్లాప్ ఇస్తుందో చూడాలి.


Share

Related posts

Rashmika mandanna: తన చుట్టుపక్కల ఆ విధంగా చేస్తే చాలా చిరాకు పడుతుందట రష్మిక మందన..??

sekhar

Sharukh khan : షారుఖ్ ఖాన్ నుంచి 2022లో రెండు భారీ ప్రాజెక్ట్స్

GRK

KGF 3: సినీ లవర్స్ ఎదురుచూస్తున్న న్యూస్… “కేజిఎఫ్ 3” స్టార్ట్ అయ్యేది ఎప్పుడో చెప్పేసిన నిర్మాత..!!

sekhar